IND vs ENG 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం

IND vs ENG 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం

భారత్, ఇంగ్లాండ్ ల మధ్య మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో ఫామ్ లో లేని తెలుగు కుర్రాడు  భరత్ ను పక్కన పెట్టి ధృవ్ జురెల్ కి ఛాన్స్ ఇచ్చారు. రాహుల్ కోలుకోకపోవడంతో సర్ఫరాజ్ కు ఛాన్స్ దక్కింది. రెండో టెస్టులో బెంచ్ కు పరిమితమైన సిరాజ్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ తుది జట్టులో స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో మార్క్ వుడ్ వచ్చి చేరాడు. సిరీస్ లో ఇరు జట్లు ఇప్పటికే చెరో టెస్ట్ గెలిచి 1-1 తో సమంగా నిలిచాయి.

భారత్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI):

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్