బంగ్లాదేశ్​ దిగుమతులపై భారత్​ ఆంక్షలు

బంగ్లాదేశ్​ దిగుమతులపై భారత్​ ఆంక్షలు
  • రెడీమేడ్ గార్మెంట్స్​కు కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా, నవా షెవా ఓడరేవులద్వారా మాత్రమే అనుమతి
  • నార్త్​ఈస్ట్​లోని ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి పలు వస్తువుల ఇంపోర్ట్​పై నిషేధం

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్​కు భారత్ భారీ షాక్ ఇచ్చింది.  ఆ దేశం నుంచి రెడీమేడ్ గార్మెంట్స్​, ప్రాసెస్డ్​ ఫుడ్​ సహా ఇతర వస్తువుల దిగుమతులపై ఇండియా పోర్ట్ ఆంక్షలు విధించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్​టీ) శనివారం  నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులను కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా, ముంబైలోని నవా షెవా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు.

అలాగే నార్త్​ఈస్ట్​లోని 11 ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి సైతం పలు వస్తువుల దిగుమతిని నిషేధించింది. వీటిలో రెడీమేడ్ గార్మెంట్స్​, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్​ ఉన్నాయి. కాగా, ఈ ఆంక్షలు భారత్ గుండా భూటాన్, నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రవాణా చేసే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించవు. కాగా, భారత్​కు ఏటా బంగ్లాదేశ్​ 700 మిలియన్​డాలర్ల విలువైన రెడీమేడ్​ గార్మెంట్స్​ను ఎగుమతి చేస్తున్నది. ఇందులో 93 శాతం ల్యాండ్​ పోర్టుల ద్వారానే వస్తున్నది. తాజా ఆంక్షలతో బంగ్లాదేశ్​పై భారీ ప్రభావం పడనున్నది. ఇటీవల చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే భారత్​ ఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తున్నది.