తిరువనంతపురం: వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా ఇండియా.. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరుజట్ల మధ్య తొలి పోరు జరగనుంది. మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌లో యంగ్‌స్టర్స్‌కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అలాగే సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్, పెర్ఫామెన్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.
వరల్డ్ కప్‌కు ముందు ఇండియా దాదాపు 20 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లో ప్లేయర్ల ప్రదర్శన ఆధారంగా 15 మందితో కూడిన తుది జట్టును సిద్ధం చేయడమే సెలెక్టర్ల ముందున్న ప్రధాన లక్ష్యం. ఆసియా క్రీడల కోసం శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ జపాన్‌కు వెళ్లడంతో యశస్వి జైస్వాల్‌కు టీమ్‌లో చోటు దక్కింది. అయితే రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడా? గిల్‌నే ఓపెనర్‌గా కొనసాగిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇంగ్లండ్‌తో జరిగిన గత సిరీస్‌లో రోహిత్ సూపర్ సెంచరీతో విమర్శలకు బదులిచ్చాడు. కోహ్లీ అరుదైన రికార్డును పూర్తి చేసేందుకు వేచి చూస్తున్నాడు. వన్డేల్లో సచిన్ తర్వాత 15 వేల రన్స్ పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీ మరో 51 రన్స్ అవసరం. ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును అందుకుంటాడేమో చూడాలి.
యంగ్ పేసర్లు గుర్నూర్ బ్రార్, అకిబ్ నబీ రాణిస్తున్నా.. పూర్తి స్థాయి మ్యాచ్ అనుభవం కోసం మరింత టైమ్ పట్టనుంది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాడు. మరోవైపు జీతాల కోత వివాదం, ఇటీవల ఎదురైన పరాజయాలను పక్కనబెట్టి ఇండియాకు దీటైన జవాబివ్వాలని విండీస్ లక్ష్యంగా పెట్టుకుంది.
