
న్యూయార్క్: రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోవాలని భారత్కు రిపబ్లికన్ పార్టీ లీడర్ నిక్కీ హేలీ సూచించారు. దీనిపై అమెరికాతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో శనివారం పోస్టు పెట్టారు. ‘‘రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లపై ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్‌గా తీసుకోవాలి.
ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికాతో చర్చలు జరపాలి. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య స్నేహం, నమ్మకం.. ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు బలమైన పునాదిగా నిలుస్తుంది. సమస్యలను పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు అవసరం. చైనాను ఎదుర్కోవడానికి కలిసి పని చేయాలని పెట్టుకున్న లక్ష్యాన్ని రెండు దేశాలు మరిచిపోవద్దు” అని నిక్కీ హేలీ సూచించారు.