ఇప్పుడు భారత్ జనాభా ఎంతో తెలుసా.. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ రిపోర్ట్

ఇప్పుడు భారత్ జనాభా ఎంతో తెలుసా.. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ రిపోర్ట్

భారత్ లో జనాభా అంతకంతా పెరిగిపోతుంది. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) నివేదిక అంచనా ప్రకారం ప్రస్తుతం ఇండియా జనాభా 144 కోట్లు. భారతదేశ జనాభా 77 సంవత్సరాలలో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఇందులో 0 –14 ఏళ్ల వయస్సు ఉన్నవారు 24 శాతం మంది ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది. నివేదికలోని ఫలితాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 144.17 కోట్ల జనాభాతో భారత్ ఫస్ట్,142.5కోట్లతో చైనా సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. 2021లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. 

ఇండియాలో శిశు మరణాలు రేటు బాగా తగ్గినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశ జనాభాలో 10 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 68 శాతం ఉన్నారు. ఇక సీనియర్‌ వృద్ధులు 7 శాతం ఉన్నారు. పురుషుల జీవిత కాలం 71 సంవత్సరాలుగా, సగటున స్త్రీల 74 సంవత్సరాలు లెఫ్ టైం ఉన్నట్లు యూఎన్‌ఎఫ్‌పీఏ తెలిపింది.

Also Read: వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..