ఇండ్ల ధరలు పెరుగుతయ్​!

ఇండ్ల ధరలు పెరుగుతయ్​!

న్యూఢిల్లీ: ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో దేశమంతటా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) అంచనా వేసింది. రేట్ల పెరుగుదల ఎనిమిది శాతం వరకు ఉండొచ్చని, మార్కెట్‌  గ్రోత్ , రికవరీ  ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని పేర్కొంది. దీని స్టడీ రిపోర్టు ప్రకారం...కరోనా మహమ్మారి ప్రభావం, పరిశ్రమ సమస్యలు తగ్గడం, ప్రభుత్వ విధానాలు బాగుండటం వల్ల  రియల్ ఎస్టేట్ రంగానికి 2023 ఫైనాన్షియల్ ఇయర్లో బలమైన డిమాండ్‌ ఉండొచ్చు. 2022 ఫైనాన్షియల్ ఇయర్లో మెరుగైన పనితీరు , వేగంగా రికవరీ కనిపించడం వంటివి కొనుగోలుదారుల నమ్మకాన్ని తిరిగి పొందేలా చేశాయి. 2023 ఫైనాన్షియల్ ఇయర్లో బలమైన డిమాండ్ నేపథ్యంలో హౌసింగ్ గ్రోత్ ఊపు కొనసాగుతుంది.  ఇండ్ల అమ్మకాలు దాదాపు 12శాతం పెరుగుతాయి.2022  ఫైనాన్షియల్ ఇయర్లో ఏడాది ప్రాతిపదికన మొదటి ఎనిమిది రియల్ ఎస్టేట్ క్లస్టర్‌లలో ఇండ్ల అమ్మకాలు 42శాతం పెరిగాయి. లోయర్ బేస్ వల్ల అమ్మకాల్లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తోంది.