కరోనా మరణాల్లో ఇటలీని దాటేసినం

కరోనా మరణాల్లో ఇటలీని దాటేసినం
  • ఐదో స్థానానికి చేరిన భారత్‌
  • ఒక్కరోజులో 55,078 కేసులు నమోదు
  • 779 మంది మృతి

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. 24 గంటల్లో 779 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 35,747కి చేరింది. దీంతో చనిపోయిన వారి సంఖ్యలో మనదేశం ఇటలీని దాటేసి.. ఐదో స్థానానికి ఎగబాకింది. 24 గంటల్లో 55,078 మంది కరోనా బారిన పడ్డారని అధికారులు చెప్పారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 16,38,70కి చేరింది. ఇప్పటి వరకు 10,57,000 మంది కోలుకోగా.. 5,45,000 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకున్నట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.54శాతం ఉంది. మరణాల రేటు 21.8 శాతంగా ఉంది. జులై 1 నుంచి ఇప్పటి వరకు 1,053,377 కేసులు నమోదయ్యాయని, వాటిలో పక్షం రోజుల్లోనే 702689 కేసులు వచ్చాయని అధికారులు చెప్పారు. యూఎస్‌, బ్రెజిల్‌ తర్వాత మన దేశం మూడో స్థానంలో కొనసాగుతోంది. మన దేశంలో రికవరీ రేటు బాగుందని, 16 రాష్ట్రాలు, యూనిటెరిటరీల రికవరీ రేట దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని హెల్త్‌ మినిస్ట్రీ చెప్పింది.