పాక్‌ను చిత్తు చేసిన ఇండియా

పాక్‌ను చిత్తు చేసిన ఇండియా

బర్మింగ్​హామ్​ : విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నుంచి ఇండియా వెంటనే తేరుకుంది. ఆదివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హర్మన్‌‌‌‌‌‌‌‌సేన 8 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడించి బోణీ కొట్టింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన పాక్‌‌‌‌‌‌‌‌  ఓవర్లన్నీ ఆడి 99 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ మునీబా అలీ (32) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఓ దశలో 96/5తో నిలిచిన పాక్‌‌‌‌‌‌‌‌ 8 బంతుల వ్యవధిలో మూడు పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు కోల్పోయి చిన్న స్కోరుకే పరిమితమైంది.

ముగ్గురు రనౌటవగా.. ఇండియా స్పిన్నర్లు స్నేహ్‌‌‌‌‌‌‌‌ రాణా (2/15), రాధా యాదవ్ (2/18) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఓపెనర్‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన (43 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో ఇండియా 11.4 ఓవర్లలోనే 102/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. షెఫాలీ (16), సబ్బినేని మేఘన (14) తొందరగానే ఔటయ్యారు. బుధవారం జరిగే చివరి గ్రూప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బార్బడోస్‌‌‌‌‌‌‌‌తో ఇండియా  పోటీ పడుతుంది.