ఒక్కరోజులో కరోనాతో 53 మంది మృతి

ఒక్కరోజులో కరోనాతో 53 మంది మృతి

భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. అధికంగా రికార్డు సంఖ్యలో పాజిటివిటీ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 19 వేల 893 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం ఈ సంఖ్య 17 వేల 135గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037కి పెరిగింది. ఇందులో 4,34,24,029 వైరస్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో వైరస్ నుంచి 53 మంది చనిపోయారు. మరణాల సంఖ్య 5,26,530గా ఉంది. 1,36,478 యాక్టివ్ కేసులున్నట్లు వెల్లడించింది.

20 వేల 419 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారి పాజిటివిటి రేటు 4.3 శాతానికి చేరిందని వెల్లడించింది. 0.31 శాతం కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు, రికవరీ రేటు 98.50 శాతంగా ఉందని తెలిపింది. కరోనా వైరస్ నుంచి చెక్ పెట్టడానికి వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 205.22 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.