IND vs AUS: డూ ఆర్ డై మ్యాచ్‌లో రాణించిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు ఒక మాదిరి టార్గెట్!

IND vs AUS: డూ ఆర్ డై మ్యాచ్‌లో రాణించిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు ఒక మాదిరి టార్గెట్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో బ్యాటింగ్ లో టీమిండియా పర్వాలేదనిపించింది. గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా ప్రారంభమైన రెండో వన్డేలో ఒక మాదిరి స్కోర్ తో సరిపెట్టుకున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (73), వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (61) మినహాయిస్తే మిగిలినవారు విఫలం కావడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ పేసర్ బార్ట్ లెట్ ఆరంభంలో టీమిండియాను దెబ్బ తీస్తే.. మిడిల్ ఓవర్స్ లో జంపా తన స్పిన్ మ్యాజిక్ ను చూపించాడు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. ఆరంభంలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాలేదు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బార్ట్ లెట్ టీమిండియాకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ తొలి బంతికి 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ లాంగాఫ్ లో బౌండరీ కొట్టడానికి ప్రయత్నించి మార్ష్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్ ఏడో ఓవర్ ఐదో బంతికి బార్ట్ లెట్ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగ్ ధాటికి ఎల్బీడబ్ల్యూ రూపంలో విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో  ఇండియా తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

వరుసగా రెండు వికెట్లు పడడంతో ఇండియా ఒత్తిడిలో పడింది. ఈ దశలో ఆసీస్ బౌలర్లు టీమిండియాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో రోహిత్, అయ్యర్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. తొలి ఓవర్లలో ఇండియా కేవలం 29 పరుగులు మాత్రమే  చేయగలిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా మన బ్యాటర్లు బ్యాట్ కు పని చెప్పారు. వరుస బౌండరీలతో హోరెత్తించారు. 
మిచ్లే ఓవెన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ మూడు బంతుల వ్యవధిలో రెండు సిక్సర్లు బాది ఆధిపత్యం చూపించాడు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

►ALSO READ | IND vs AUS: హాఫ్ సెంచరీలతో సరిపెట్టుకున్నారు: టీమిండియాను నిలబెట్టిన రోహిత్, శ్రేయాస్

భారీ స్కోర్ ఖాయమనుకుంటే ఆస్ట్రేలియా మరోసారి పుంజుకుంది. స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ (73), శ్రేయాస్ అయ్యర్ (61), కేఎల్ రాహుల్ (11) వికెట్లు పడగొట్టి మరోసారి ఇండియాను కష్టాల్లో పడేసింది. స్టార్క్ రోహిత్ ను ఔట్ చేస్తే.. ఆ తర్వాత జంపా తన స్పిన్ మ్యాజిక్ తో అయ్యర్, రాహుల్ ను బౌల్డ్ చేశాడు. ఈ దశలో అక్షర్ పటేల్, వాషింగ్ టన్ ఆరో వికెట్ కు 39 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రీజ్ లో ఉన్నంతవరకు అద్భుతంగా ఆడిన అక్షర్ స్టార్క్ పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు. చివర్లో హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్ ను 250 పరుగులు దాటించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు పడగొట్టాడు. బార్ట్ లెట్ మూడు.. స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టారు.