ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఫైనల్లో జ్యోతి సురేఖ

ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఫైనల్లో జ్యోతి సురేఖ

బ్యాంకాక్‌‌‌‌ : ఇండియా స్టార్ ఆర్చర్‌‌‌‌ జ్యోతి సురేఖ వెన్నం.. ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో జ్యోతి 148–145తో హుయాంగ్‌‌‌‌ జోయు (చైనీస్‌‌‌‌ తైపీ)పై గెలిచి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు అర్హత సాధించింది. మరో పోరులో పర్నీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ 147–145తో విక్టోరియా లాన్‌‌‌‌ (కజకిస్తాన్‌‌‌‌)ను ఓడించి టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌కు చేరింది. టీమ్‌‌‌‌ విభాగంలో జ్యోతి–అదితి–పర్నీత్‌‌‌‌ బృందం 228–217తో థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌పై నెగ్గి స్వర్ణ పతక పోరుకు చేరింది.

గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. చైనీస్‌‌‌‌ తైపీతో తలపడుతుంది. కాంపౌండ్‌‌‌‌ మిక్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో అదితి–ప్రియాన్షు జోడీ 157–155తో అడెల్‌‌‌‌ జెన్బోనివా–ఆండ్రీ టైటూన్‌‌‌‌ (కజికిస్తాన్‌‌‌‌)పై నెగ్గారు. మెన్స్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ వర్మ, ప్రథమేశ్‌‌‌‌, ప్రియాన్షూ త్రయం బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించింది. ప్లే ఆఫ్‌‌‌‌ షూటాఫ్‌‌‌‌లో ఇండియా 29–28తో చైనీస్‌‌‌‌ తైపీని ఓడించింది.