బౌలర్లు - బౌలర్లు ఒక్కటయ్యారు: బుమ్రాకు పాకిస్తాన్ బౌలర్ ప్రత్యేక బహుమతి

 బౌలర్లు - బౌలర్లు ఒక్కటయ్యారు: బుమ్రాకు పాకిస్తాన్ బౌలర్ ప్రత్యేక బహుమతి

భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తండ్రి విషయం అందరకి విదితమే. బుమ్రా సతీమణి సంజన గణేషన్ సెప్టెంబర్ 4న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుమ్రా దంపతులు తమ కుమారుడికి 'అంగద్ జస్‌ప్రీత్ బుమ్రా'గా నామకరణం కూడా చేశారు. ఈ నేపథ్యంలో తండ్రిగా ప్రమోషన్ పొందిన బుమ్రాకు పాకిస్తాన్ పేసర్ షాహీన్ ఆఫ్రిది బహుమతి ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది.

సంజన గణేషన్ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో భార్య దగ్గర ఉండటం కోసం బుమ్రా ఆసియా కప్‌ టోర్నీ మధ్యలో స్వదేశానికి తిరిగి వెనక్కి వచ్చేసిన విషయం తెలిసిందే. అనంతరం నేడు(ఆదివారం) పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌తో తిరిగి జట్టులో చేరాడు.

ఆగని వర్షం.. మ్యాచ్ రేపటికి వాయిదా

ఆసియా కప్‌ -2023 సూపర్‌-4 దశలో భారత్‌ - పాకిస్తాన్‌ మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అడ్డుపడ్డ విషయం తెలిసిందే. ఆట ప్రారంభమై 24 ఓవర్లు గడిచాక మొదలైన వర్షం.. ఆపై ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రిజర్వ్‌ డే(సెప్టెంబర్ 11)కు వాయిదా వేశారు. భారత్ ఇన్నింగ్స్‌ నిలిచిపోయిన.. 24.1 ఓవర్ల నుంచి రేపు మ్యాచ్‌ కొనసాగించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఆట ఆరంభం కానుంది.