IND vs SA: దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు..రెండో టీ20 మ్యాచ్ జరుగుతుందా..?

IND vs SA: దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు..రెండో టీ20 మ్యాచ్ జరుగుతుందా..?

భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కు వర్షం అడ్డంకి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. డర్బన్ లోని కింగ్స్ మీడ్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్  ఒక్క బంతి పడకుండానే రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ కూడా వేయకుండానే ఈ మ్యాచ్ మొత్తం వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. అయితే రెండో టీ20కు సైతం వర్షం వదిలేలా కనిపించడం లేదు. రెండో టీ20 జరుగుతుందా..? వర్షం పడే ఛాన్స్ ఎంత ఉందనే విషయాలు ఇప్పుడు చూద్దాం. 

గబెహా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు నేడు (డిసెంబర్ 12) రెండో వన్డే ఆడేందుకు సిద్ధమయ్యాయి. సెయింట్ జార్జ్ పార్క్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కు 70 శాతం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. గబెహాలో మేఘావృతమైన పరిస్థితులను సూచిస్తుంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షపు జల్లులు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా అంచనా వేయబడింది. తేమ స్థాయిలు సుమారుగా 75 శాతంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ జరగటం అసాధ్యంగానే కనిపిస్తుంది. 

2024 జూన్ లో టీ20 వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సిరీస్ లో సెలక్టర్లు కుర్రాళ్లకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. 17 మంది ఆటగాళ్లను చేయగా తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందో ఆసక్తికరంగా మారింది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 8:30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుంది. జట్టులో అందరూ ఫామ్ లోనే ఉండడటం కలిసొచ్చే అంశం. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ రద్ధయితే చివరి టీ20 లో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ దక్కుతుంది. మూడో టీ20 గురువారం( డిసెంబర్ 14) న జరుగుతుంది.         

భారత జట్టు: 

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.