మాతో కలవకుండా భారత్ పెద్ద తప్పు చేసింది: చైనా

మాతో కలవకుండా భారత్ పెద్ద తప్పు చేసింది: చైనా

ప్రపంచ అతిపెద్ద స్వేచ్ఛా వ్యాణిజ్య డీల్‌‌పై 15 ఆసియా-పసిఫిక్ దేశాలు ఆదివారం సంతకాలు చేశాయి. ఈ ట్రేడ్ డీల్ తన ప్రాభవాన్ని పెంచుకోవడంలో చైనాకు ఎంతో సాయపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌‌నర్‌‌షిప్ (ఆర్‌‌సీఈపీ) కూటమిలో జాయిన్ కాకపోవడం ద్వారా వ్యూహాత్మకంగా భారత్ పెద్ద తప్పు చేసిందని చైనా స్టేట్ మీడియా పేర్కొంది.

‘ఆర్‌‌సీఈపీ అగ్రిమెంట్ కిందకు 2.2 బిలియన్ల మంది వస్తారు. దాదాపుగా ప్రపంచ జనాభాలో 30 శాతం మంది దీని కిందకే వస్తారు. జీడీపీ పరంగా చూసుకుంటే దీని విలువ సుమారు 26.2 ట్రిలియన్లు. ఇది గ్లోబల్ జీడీపీలో ముప్పై శాతంగా చెప్పొచ్చు. ఈ ఒప్పందం ఈస్ట్ ఏషియన్ రీజియన్ కో-ఆపరేషన్‌‌లో చాలా కీలకం. ఈ డీల్‌‌‌తో చైనాకు అదనపు ప్రయోజనం కలుగుతుందని భారత ప్రభుత్వం భావించింది. దీంతో ఒప్పందాన్ని తోసిపుచ్చింది. అయితే కరోనాతో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఈ ఒప్పందంలో ఇండియా చేరాల్సింది. కరోనా కారణంగా ఇండియా ఎకానమీ దారుణంగా దెబ్బతింది. ఈ ఒప్పందంలో భాగం అయ్యుంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి అవకాశం ఉండేది’ అని చైనా అధికార పత్రిక జిన్‌‌హువా పేర్కొంది.