కరోనా పై ఫైట్ కు డబ్ల్యూహెచ్ఒ తో కలిసి పనిచేయనున్న భారత్

కరోనా పై ఫైట్ కు డబ్ల్యూహెచ్ఒ తో కలిసి పనిచేయనున్న భారత్

జెనీవా : కరోనా నియంత్రణకు వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ (డబ్ల్యూహెచ్ఒ) కలిసి -భారత్ పనిచేయనుంది. దేశం నుంచి పోలియోను తరిమికొట్టేందుకు అనుసరించిన వ్యూహాలను కరోనా పై ఫైట్ కోసం అనుసరించనున్నారు. డబ్ల్యూహెచ్ఒ పోలియో టీమ్ తో కలిసి ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ పనిచేయనుంది. 2014 లో మనదేశం పూర్తిగా పోలియోను తరిమికొట్టింది. ఇందుకోసం డబ్ల్యూహెచ్ఒ- నేషనల్ పోలియో సర్వీలెన్స్ నెట్ వర్క్ లు కలిసి పనిచేశాయి. డేటా సేకరణ, వ్యూహాలు, అనురించిన విధానాలతో పోలియో ను అరికట్టగలిగారు. మళ్లీ కరోనా పై ఫైట్ కోసం ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వీలెన్స్ ప్రొజెక్ట్ (ఐడీఎస్ పీ) తో కలిసి డబ్ల్యూహెచ్ఒ తో పనిచేయనుంది. భారత్ చొరవను డబ్ల్యూహెచ్ఒ డైరక్టర్ జనరల్ గెబ్రెయెసస్ అభినందించారు. డబ్య్యూహెచ్ఒ తో భారత్ కలిసి పనిచేయటం గ్రేట్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు. పోలియోపై విజయం సాధించినట్లే కరోనాపై విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సైతం డబ్ల్యూహెచ్ఒ తో పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. పోలియో ను జయించినట్లే కరోనా ను జయిద్దామన్నారు.