
న్యూఢిల్లీ: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండియా యంగ్‌స్టర్ ఆయుష్ శెట్టి బ్రాంజ్ మెడల్ సాధించాడు. అమెరికాలోని స్పొకానెలో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఆయుష్ 18–21, 15–21తో ఇండోనేసియాకు చెందిన అల్వి ఫర్హాన్ చేతిలో పరాజయం పాలై బ్రాంజ్‌తో సంతృప్తి చెందాడు. ఈ టోర్నీలో మెడల్ నెగ్గిన పదో ఇండియన్‌గా నిలిచాడు.