భూతల్లిపై ఒట్టెయ్ .. తెలుగోడి వడి చూపెట్టేయ్

భూతల్లిపై ఒట్టెయ్ ..  తెలుగోడి వడి చూపెట్టేయ్

కమల్ హాసన్, శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’. జులై 12న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది. రీసెంట్‌‌‌‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. బుధవారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. అనిరుధ్ కంపోజ్ చేసిన పాటకు సుద్దాల అశోక్ తేజ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ లిరిక్స్ రాశారు. రితేష్ రావు, శ్రుతిక సముద్రాల కలిసి పాడారు. ‘సౌర.. శిరస్సంటే శిఖరం నువ్వే.. నిప్పులు గక్కే ఖడ్గం నీదే.. కసిరెక్కల గుర్రంపైన కదిలొచ్చే భూకంపం నువ్వే.. నిన్ను ఆపే వాడేవడైనా.. చెయ్యే వేస్తే శవమై పోడా.. భూతల్లిపై ఒట్టెయ్.. తెలుAnirudhగోడి వడి చూపెట్టేయ్.. తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టేయ్ ’ అంటూ సాగిన పాటలో సేనాపతిగా నటించిన కమల్ హాసన్ స్వాతంత్య్ర స‌‌‌‌మ‌‌‌‌ర‌‌‌‌యోధుడిగా బ్రిటీష్ వారిని ఏవిధంగా ఎదుర్కొన్నాడు అనేది పాట ద్వారా చూపించిన విధానం ఆకట్టుకుంది.  కాజల్, రకుల్ ప్రీత్‌‌‌‌సింగ్ హీరోయిన్స్‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, ఎస్‌‌‌‌జే సూర్య, బాబీ సింహా, మనోబాల, బ్రహ్మానందం, సముద్రఖని  ఇతర పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మించాయి. ఇరవై ఎనిమిదేళ్ల  తర్వాత  సీక్వెల్‌‌‌‌గా వస్తోన్న ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఉన్నాయి.