
ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియన్ ఆర్మీ డీజీ ఈఎంఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టి టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 14.
పోస్టుల సంఖ్య: 69.
పోస్టులు: జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (జేటీటీఐ) 02, స్టెనోగ్రాఫర్ గ్రేడ్–II 02, మల్టి టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) 23, వాషర్మెన్/ దోభి 03, లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ) 25, మల్టిటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 14.
ఎలిజిబిలిటీ: జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ (జేటీటీఐ): ఫిజిక్స్, మ్యాథ్స్‌లో బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు డిగ్రీలో కనీసం ఏడాదికాలమైనా ఇంగ్లిష్ తప్పనిసరిగా చదివి ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, మల్టి టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్), ఎల్ డీసీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ALSO READ : దీపావళి కానుకగా రైల్వేలో కొలువుల జాతర..
వాషర్ మెన్/ దోభి: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (జేటీటీఐ) పోస్టులకు 21 నుంచి 30 ఏండ్లు ఉండాలి. మిగతా పోస్టులకు 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 11.
లాస్ట్ డేట్: నవంబర్ 14.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు indianarmy.nic.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
ఎగ్జామ్ ప్యాటర్న్ : రాత పరీక్ష ఓఎంఆర్ బేస్డ్ విధానంలో జరుగుతుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజినింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.