ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఆర్మీ

V6 Velugu Posted on Oct 19, 2021

జమ్మూ కశ్మీర్‌ రాజౌరీ సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు భారత సైనికులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. మరో నలుగురు ఉగ్రవాదుల కోసం జవాన్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా, రాజౌరీ సెక్టార్‌లోని దట్టమైన అడవుల్లో దాక్కొని ఉన్న టెర్రరిస్టుల కోసం ఆర్మీ పలు వారాలుగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య పలుమార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 9 మంది సైనికులు మృతి చెందారు. దీంతో ఈ నెల 16న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆ ఏరియాను సందర్శించారు. టెర్రరిస్టులను తుదముట్టించేందుకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, భద్రత పెంపుపై స్థానిక కమాండర్లతో రావత్ చర్చలు జరిపారు. 

మరిన్ని వార్తల కోసం: 

బంగ్లా హిందువులను రక్షించండి: మిలింద్ డియోరా

సోల్జర్స్ చనిపోతుంటే.. పాక్‎తో టీ20 మ్యాచ్ ఆడతారా?: అసదుద్దీన్ ఒవైసీ

అమ్మాయిలపై దూసుకెళ్లిన పోలీస్ కారు

Tagged TERRORISTS, killed, Indian Army, Soldiers, Lashkar-e-Taiba, Bipin Rawat, Rajouri Sector, CDS Chief

Latest Videos

Subscribe Now

More News