సైన్యంలో చేరేందుకు ముందుకొస్తున్న కశ్మీర్ యువకులు

సైన్యంలో చేరేందుకు ముందుకొస్తున్న కశ్మీర్ యువకులు

జమ్మూ కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది. జమ్మూ రీజియన్ లో నిర్వహించిన ఆర్మీ ర్యాలీకి వందలాది మంది యువకులు హాజరయ్యారు. ఫిజికల్ టెస్టుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మండుటెండల్లోనూ పరుగులు తీశారు.

సైన్యంలో చేరేందుకు కశ్మీర్ యువకులు ఆసక్తి చూపిస్తున్నారని ఆర్మీ అధికారులు చెప్పారు. ఆర్మీలో ఎంపికయ్యేందుకు తాము కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తామని కశ్మీర్ యువకులు చెబుతున్నారు.