బడ్జెట్‌‌‌‌పై కంపెనీల ఆశలు

బడ్జెట్‌‌‌‌పై కంపెనీల ఆశలు

బడ్జెట్‌‌‌‌పై కంపెనీల ఆశలు
వినియోగం, క్యాపెక్స్ పెంచాలి
హెల్త్‌‌‌‌కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో జీఎస్‌‌‌‌టీ సంస్కరణలు తేవాలి
మరిన్ని సెక్టార్లకు పీఎల్‌‌‌‌ఐ..రెన్యూవబుల్ ఎనర్జీపై  ఫోకస్‌‌‌‌ పెంచాలి: కంపెనీల సీఈఓలు 

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు :  స్లోడౌన్‌‌‌‌లో గ్లోబల్ ఎకానమీ, గరిష్ట స్థాయిల్లో వడ్డీ రేట్లు, వెంటాడుతున్న  ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ సమస్యలు..ఇలాంటి పరిస్థితుల్లో  వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు బడ్జెట్‌‌‌‌లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని వివిధ ఇండస్ట్రీలు ఎదురుచూస్తున్నాయి. దేశ ఎకానమీ గ్రోత్ స్లో అవ్వకుండా చూస్తూనే, ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ తగ్గించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు తీసుకోవాల్సి ఉంది.  వినియోగంతో పాటు  క్యాపిటల్ ఎక్స్‌‌‌‌పెండించర్‌‌‌‌‌‌‌‌ను పెంచేందుకు, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ఆకర్షించేందుకు, ఇన్నొవేషన్లకు ప్రోత్సాహం ఇచ్చేందుకు బడ్జెట్‌‌‌‌లో పెద్ద పీట వేయాలని వివిధ కంపెనీల సీఈఓలు కోరుకుంటున్నారు.  

వీటిపై ఫోకస్ పెట్టండి..

1) క్యాపిటల్ ఎక్స్‌‌‌‌పెండిచర్ బూస్ట్‌‌‌‌

క్యాపిటల్ ఎక్స్‌‌‌‌పెండిచర్‌‌‌‌‌‌‌‌ (మూలధన వ్యయాల) ను  ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని ఇండియన్ కంపెనీలు ఆర్థిక మంత్రిని కోరుతున్నాయి. అంతేకాకుండా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వ్యవస్థలో వెనుకబడిన వర్గాలకు సపోర్ట్‌‌‌‌గా నిలవాలన్నాయి.  ప్రభుత్వం క్యాపెక్స్‌‌‌‌ పెంచాలని యాక్సిస్ బ్యాంక్ సీఈఓ అమితాబ్ చౌదరి  అన్నారు. 

2) వినియోగానికి ప్రోత్సాహం

వ్యవస్థలో డిమాండ్‌‌‌‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు బడ్జెట్‌‌‌‌ ద్వారా చర్యలు తీసుకోవాలని కంపెనీలు  కోరుతున్నాయి. ‘పాజిటివ్ సెంటిమెంట్‌‌‌‌ను క్రియేట్‌‌‌‌ చేయడంతో పాటు వినియోగానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ప్రభుత్వం అదే పనిలో ఉందని అనుకుంటున్నా’ అని మహీంద్రా అండ్ మహీంద్రా  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ రాజేష్‌‌‌‌ జేజురికర్‌‌‌‌‌‌‌‌ అన్నారు.  దేశంలో ఇన్‌‌‌‌ఫ్లేషన్ కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌ వరకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న లిమిట్‌‌‌‌ 6 శాతానికి పైనే నమోదయ్యింది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 5.77 శాతానికి తగ్గింది. ఇన్‌‌‌‌ఫ్లేషన్ దిగొస్తుండడంతో వ్యవస్థలో వినియోగం పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని కంపెనీలు కోరుతున్నాయి. 

3) హెల్త్‌‌‌‌కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో జీఎస్‌‌‌‌టీ సంస్కరణలు..

బడ్జెట్ ద్వారా  మరింత సపోర్ట్ దొరుకుతుందని చాలా కాలం నుంచి హెల్త్‌‌‌‌కేర్ సెక్టార్ ఎదురుచూస్తోంది.  జీఎస్‌‌‌‌టీ సంస్కరణలు తీసుకురావాలని అపోలో హాస్పిటల్స్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. కిందటేడాది జులై నుంచి  మెడిసిన్స్‌‌‌‌, ఇంప్లాంట్స్‌‌‌‌పై జీఎస్‌‌‌‌టీ వేస్తున్నారు. అంతేకాకుండా రోజుకి రూ.1,000 కంటే ఎక్కువ రెంట్ వసూలు చేసే హాస్పిటల్ రూమ్స్‌‌‌‌పై  జీఎస్‌‌‌‌టీ పడుతోంది.  ‘హెల్త్‌‌‌‌కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో జీఎస్‌‌‌‌టీ  సంస్కరణలు అవసరం. ప్రస్తుతం అవకాశం ఉంది కాబట్టి ఇండస్ట్రీకి ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వండి’ అని అపోలో హాస్పిటల్స్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ కామినేని శోభన అన్నారు. అగ్రికల్చర్ సెక్టార్ మాదిరే హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌ను కూడా నేషనల్ ప్రయారిటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌గా పరిగణించాలని షాల్బే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌‌‌‌ ప్రెసిడెంట్ షనాయ్ షా కోరారు. దీంతో లాంగ్‌‌‌‌టెర్మ్‌‌‌‌ లోన్లను తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి పొందడానికి తమకు వీలుంటుందని వివరించారు. 

4) పీఎల్‌‌‌‌ఐ స్కీమ్‌‌‌‌..
2021 లో తీసుకొచ్చిన  ప్రొడక్షన్ లింక్డ్‌‌‌‌ ఇన్సెంటివ్ స్కీమ్‌‌‌‌ (పీఎల్‌‌‌‌ఐ) సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌‌‌‌ను ప్రస్తుతం 13 సెక్టార్లకు విస్తరించగా, రూ. 2 లక్షల కోట్లను రాయితీలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. పీఎల్‌‌‌‌ఐ స్కీమ్‌‌‌‌పై ప్రభుత్వం ఫోకస్ పెంచుతుందని కంపెనీలు అంచనావేస్తున్నాయి. ఈ స్కీమ్‌‌‌‌తో దేశంలో మాన్యుఫాక్చరింగ్ పెరగడమే కాకుండా, పెద్ద మొత్తంలో జాబ్స్ క్రియేట్ అవుతాయని పేర్కొన్నాయి.  ఇన్నోవేషన్స్‌‌‌‌ను ప్రోత్సహించేందుకూ చర్యలు అవసరమని వివరించాయి.

రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు..

క్రూడాయిల్ ధరలు రికార్డ్ స్థాయికి పెరగడంతో  రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెంచింది. ఈ ఏడాది రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని కిందటి నెలలో పవర్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌కే సింగ్ వెల్లడించారు. ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను పెంచేందుకు ట్యాక్స్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను సరళం చేయాలని  రెన్యూ పవర్ ఎండీ సుమంత్‌‌‌‌ సిన్హా అన్నారు. గ్రోత్‌‌‌‌ను, ఉద్యోగాలను పెంచే నిర్ణయాలు బడ్జెట్‌‌‌‌లో ఉంటాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఎంఎస్‌‌‌‌ఎంఈ, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లపై రానున్న బడ్జెట్‌‌‌‌లో కేటాయింపులు పెరుగుతాయని నీతి ఆయోగ్‌‌‌‌ సీఈఓ సరమేశ్వరన్ అయ్యర్ పేర్కొన్నారు.