పోస్టల్ ఉద్యోగులకు రూ. 10 లక్షల పరిహారం

పోస్టల్ ఉద్యోగులకు రూ. 10 లక్షల పరిహారం

విధి నిర్వహణలో భాగంగా పోస్టల్ ఉద్యోగులు కరోనా బారిన పడి చనిపోతే వారికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించనున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు భారత ప్రభుత్వం దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కొన్ని సేవలను మాత్రం కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఆ సేవలలో పోస్టల్ సర్వీస్ కూడా ఒకటి. తపాలా సేవలను కూడా అత్యవసర సేవల కిందకు ప్రభుత్వం మార్చింది. తపాలా కార్యాలయాలు సాధారణ సేవలతో పాటు దేశవ్యాప్తంగా ఆహార ప్యాకెట్లు, రేషన్లు మరియు అవసరమైన మందులను కూడా పంపిణీ చేస్తున్నాయి.

‘కోవిడ్ -19 పరిస్థితి నేపథ్యంలో.. విధులు నిర్వహిస్తూ చనిపోతే గ్రామీణ డాక్ సేవకులతో సహా పోస్టల్ ఉద్యోగులందరికి రూ .10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం వెంటనే అమలులోకి వస్తుంది. కోవిడ్ -19 సంక్షోభం ముగిసే వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది’ అని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది.

శనివారం కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నిరాష్ట్రాల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ మరియు చీఫ్ జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోస్టల్ నెట్‌వర్క్‌ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు తగు సేవలందించాలని ఆయన ఆదేశించారు.

For More News..

కత్రినా ఐటం సాంగ్ కు డేవిడ్ వార్నర్ చిందులు

ఏప్రిల్ 21 నుండి అన్ని కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసెస్

వీడియో వైరల్: ఫోన్ చేస్తే ఇంటికొచ్చి బర్త్ డే చేసిన పోలీసులు