Cyber alert : మీ మొబైల్ ఫోన్లకు అలాంటి మేసేజ్ లు వస్తున్నాయా..మీ ఖాతా ఖాళీ అయినట్లే

Cyber alert : మీ మొబైల్ ఫోన్లకు అలాంటి మేసేజ్ లు వస్తున్నాయా..మీ ఖాతా ఖాళీ అయినట్లే

ఇటీవల కాలంలో సైబర్క్రైమ్స్ బాగా పెరిగిపోయాయి. పెరుగుతున్నటెక్నాలజీ నీ ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. టెక్నాలజీని ఏదో రూపంలో వినియోగించుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవారికి సైబర్ అటాక్ లు తప్పడం లేదు..మొబైల్ ఫోన్లకు మేసేజ్, లింక్ లు పంపడం ద్వారా మాల్వేర్లతో ఇన్ ఫెక్ట్ చేసి దోచుకుంటున్నారు.. అలాంటి మోసాల్లో ఫేక్ యాడ్స్ మేసేజ్ లు ఉన్నాయి. ఇటీవల ఫేక్ యాడ్స్ తో మోసాలు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేసేజ్ లపై ప్రజలను అలెర్ట్ చేస్తోంది.

స్టాక్, ట్రేడింగ్ కు సంబంధించిన మోసపూరిత ప్రకటనలు, సోషల్ మీడియా యాప్ లలో ఉచిత టిప్స్ గురించి జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. మోసగాళ్లు ఎక్కువగా డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు వినియోగించి యాడ్స్ ద్వారా మోసాలు చేస్తున్నారని అలర్ట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి యాక్టర్స్ ఫొటోలు, వీడియోలు మార్పింగ్ చేసి ప్రజలను మోసగిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులు  కేంద్ర ప్రభుత్వం మేసేజ్ ల ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తోంది. డబ్బు సంపాదించాలనే కోరికతో స్కామర్లు, సైబర్ మోసగాళ్లకు చిక్కొద్దని హెచ్చరిస్తోంది. 

తెలియని నంబర్లనుంచి వచ్చే మేసేజ్ లు, వెబ్ సైట్ లింకులను ఓపెన్ చేయొద్దని చెపుతోంది. వాటిని క్లిక్ చేస్తే మోసగాళ్ల చేతికి చిక్కినట్లే అని హెచ్చరిస్తోంది. సైబర్ నేరాలు, మోసాలకు సంబంధించి ‘‘సంచార్ సాథీ’’ వెబ్ సైట్ లో తెలియజేయడం గానీ, cybercrime.go.in పోర్టల్ లో గానీ ఫిర్యాదు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. లేదా 1930 నంబర్ డయల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.