శ్రీలంక ఇండియన్ ఎంబసీకి ఆత్మాహుతి దాడి వార్నింగ్

శ్రీలంక ఇండియన్ ఎంబసీకి ఆత్మాహుతి దాడి వార్నింగ్

ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన శ్రీలంకలో ప్రస్తుతం భయంకరమైన వాతావరణం ఉంది. ఆ దేశాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టుగా అనుమానాలు బలపడటంతో… ఆర్మీని రంగంలోకి దించుతోంది అక్కడి ప్రభుత్వం.

తమ దేశాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు శ్రీలంక పోలీసులకు పదిరోజుల ముందే ఇంటలిజెన్స్ రిపోర్ట్ అందింది. శ్రీలంక పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందర…. దేశమంతటా ఉన్న ఉన్నతాధికారులకు హై అలర్ట్ ఆదేశాలు ఇచ్చారు. దేశంపై ఉగ్రవాదులు దాడికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ఏప్రిల్ 11న ఆయన హై అలర్ట్ ఆదేశాలు ఇచ్చారు.

జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం… శ్రీలంకలో ఏడాదికాలంగా రాడికల్ ముస్లిం గ్రూప్ నేషనల్ తౌహీత్ జమానత్- NTJ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది. గతేడాది భారీ స్థాయిలో బుద్ధ విగ్రహాల ధ్వంసానికి పాల్పడింది ఈ సంస్థ. NTJ శ్రీలంకలోని పలుచోట్ల భారీ దాడులకు ప్రణాళికలు వేసిందని విదేశాంగ శాఖ ఇంటలిజెన్స్ సమాచారం సంపాదించింది. ఆత్మాహుతి బలగాలతో ఈ దాడులు చేస్తారని సమాచారం సేకరించింది. ఈ ఉగ్రవాద సంస్థ లక్ష్యాల్లో శ్రీలంకలోని భారత హైకమిషనరేట్ కూడా ఉంది.

ఉగ్రవాదుల దాడులతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.