ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ (ఐఐటీహెచ్) అలుమ్నీ రిలేషన్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: అలుమ్నీ రిలేషన్స్ మేనేజర్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్– గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 13.
లాస్ట్ డేట్: జూన్ 03.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ careers.iith.ac.inను సందర్శించండి.
►ALSO READ | డిగ్రీ, పీజీ అర్హతతో ICMRలో కొలువులు.. 35 ఏళ్లలోపు ఉన్నోళ్లకు ఛాన్స్..పూర్తి వివరాలు ఇవే!
