50,907 వజ్రాలతో ఉంగరం.. ధర.6.4కోట్లు

50,907 వజ్రాలతో ఉంగరం.. ధర.6.4కోట్లు

ఒక భారతీయ నగల వ్యాపారి  ఓ ఉంగరాన్ని రూపొందించి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ముంబైలోని హెచ్‌కె డిజైన్స్, హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 50,907 వజ్రాలతో ఒక ఉంగరాన్ని రూపొందించాయి. ఇది అత్యధిక వజ్రాలు ఉన్న ఏకైక ఉంగరంగా రికార్డు సృష్టించింది. అంతే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఉంగరం పూర్తిగా రీసైకిల్ చేసిన బంగారం, వజ్రాలతో తయారు చేయబడింది. ఇది కస్టమర్ల నుంచి రిటర్న్ తీసుకున్న జ్యువెల్లరీ ఐటెమ్స్ నుంచి ఇది రూపొందించబడింది.

ఆభరణాల వ్యాపారి ప్రకారం, ఈ ఉంగరం ఖరీదు $7,85,645 అంటే ఇండియన్ కరెన్సీలో దీని ధర రూ. 6.4 కోట్లు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ఈ ఖరీదైన ఉంగరానికి సంబంధించి ఓ వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ రింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

GWR ప్రకారం, రింగ్ పూర్తి కావడానికి దాదాపు తొమ్మిది నెలలు పట్టింది. ఉంగరానికి యుటియెరియా అని పేరు పెట్టారు. ఇది పర్యావరణాన్ని సూచించేలా ఉంగరం పై భాగాన చిన్నగా సీతాకోకచిలుకతో కూడిన పొద్దు తిరుగుడు పువ్వును కలిగిన నిర్మాణాన్ని చేశారు. ఇంతకుముందు, భారతీయ ఆభరణాల కంపెనీ SWA డైమండ్స్ 24,679 వజ్రాలతో కూడిన పుట్టగొడుగుల ఆకారపు ఉంగరాన్ని రూపొందించి రికార్డు సృష్టించింది.

https://twitter.com/GWR/status/1651894797844594689