సింగపూర్‌లో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం.. భారతీయ వ్యక్తికి 16 ఏళ్ల జైలుశిక్ష

 సింగపూర్‌లో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం.. భారతీయ వ్యక్తికి 16 ఏళ్ల జైలుశిక్ష

2019లో యూనివర్శిటీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో 26 ఏళ్ల భారతీయ యువకుడికి సింగపూర్‌లోని కోర్టు 16 ఏళ్ల జైలుశిక్షతో పాటు 12 లాఠీ దెబ్బలు విధించింది. కిడ్నాప్, దొంగతనం ఆరోపణలను కూడా శిక్షలో పరిగణనలోకి తీసుకుంది.

యూనివర్శిటీ విద్యార్థిని బస్‌స్టాప్‌కు అర్థరాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా, క్లీనర్‌గా పనిచేస్తున్న చిన్నయ్య, ఆమెను డైవర్ట్ చేసి, ఆపై ఆమెను కొట్టి, అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని ఓ వార్తా కథనం తెలిపింది. ఈ ఘటనలో విద్యార్థిని ముఖంపై, ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. ఈ అత్యాచారం మే 4, 2019న జరిగింది. అయితే చిన్నయ్య మానసిక పరిస్థితికి అనేక దఫాలు మానసిక వైద్య పరీక్షలు అవసరమని కేసు విచారణకు నాలుగేళ్లు పట్టిందని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది.

చిన్నయ్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా, ఆమె ఊపిరి పీల్చుకోలేక అతని చేతిని ఆమె గొంతు నుండి లాగడానికి ప్రయత్నించింది. కానీ చిన్నయ్య తన పట్టును బిగించాడు. దీని వలన ఆమె ఊపిరి పీల్చుకోవడం మరింత కష్టమైందని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (డీపీపీ) కయల్ పిళ్లై చెప్పారు. మౌనంగా ఉండమని, ఆమె మాట ఎవరూ వినరని కూడా అన్నారు. తనపై అత్యాచారం చేసిన తర్వాత చిన్నయ్య ఆమెను శారీరకంగా హింసించడం ప్రారంభించాడని పిళ్లే చెప్పారు. ఆ తర్వాత అతను ఆమె వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగి.. మిగిలిన నీటిని ఆమె శరీరం దిగువ భాగంలో పోశాడన్నారు.

కాసేపటి తర్వార అతను అక్కడ్నుంచి పక్కకు వెళ్లడంతో.. విద్యార్థిని వెంటనే తన బ్యాగ్ వద్దకు వెళ్లి.. అక్కడ కనిపించిన కత్తెరను తీసుకుంది. ఆ తర్వాత వచ్చిన చిన్నయ్యను ఆమె చేతిలో ఉన్న కత్తితో బెదిరించిందని డీపీపీ తెలిపింది. ఆమె తన కళ్లద్దాలను గుర్తించలేకపోయినప్పటికీ, ఆమె తన ప్రియుడితో మాట్లాడటానికి తన మొబైల్ ఫోన్‌ను కనుగొనగలిగింది. ఆ తర్వాత ఆమె తన స్నేహితుడిని సంప్రదించి పోలీసులకు ఫోన్ చేసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. విద్యార్థినిని లైంగిక వేధింపుల పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో ఆమె మెడ భాగంలో గొంతునులిమి చంపిన గుర్తులతో సహా పలు గీతలు, గాయాలు, స్క్రాప్‌లు ఉన్నట్లు వారు కనుగొన్నారు. అనంతరం చిన్నయ్యను మే 5, 2019న అరెస్టు చేశారు. ఈ కేసులో తీవ్రమైన అత్యాచారానికి పాల్పడినందుకు, చిన్నయ్యకు కనీసం 12 లాఠీ దెబ్బలతో పాటు 16 సంవత్సరాల జైలు శిక్ష పడింది.