నేవిలోకి రోమియో హెలికాప్టర్లు వచ్చినయ్!

నేవిలోకి రోమియో హెలికాప్టర్లు వచ్చినయ్!

వాషింగ్టన్: నేవీలోకి ఎంహెచ్60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ వచ్చి చేరాయి. ‘రోమియో’లుగా పిలిచే ఈ హెలికాప్టర్లను ఇండియన్ నేవీకి అమెరికన్ నేవీ అందజేసింది. శాన్ డియాగోలోని ఎన్ఏఎస్ నార్త్ ఐల్యాండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో రెండు ఎంహెచ్60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ ను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో ఇండియా అంబాసిడర్ తరన్​జిత్ సింగ్ సంధు హాజరయ్యారు. మల్టీ రోల్ హెలికాప్టర్లు కోనుగోలు.. ఇండియా, అమెరికా సంబంధాల్లో మైలు రాయి అని సంధు చెప్పారు. ఎంహెచ్60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ అన్ని -వాతావరణ పరిస్థితుల్లోనూ దూసుకెళ్తాయి. మల్టిపుల్ మిషన్లలో ఉపయోగించేందుకు వీలుగా వీటిని రూపొందించారు.  ప్రపంచంలోని చాలా దేశాల్లో వీటిని మోహరించారు. దీని పని తీరుతో సరితూగే హెలికాప్టర్లే లేవని చెబుతారు. ఇండియన్ క్రూకు చెందిన ఫస్ట్ బ్యాచ్ ప్రస్తుతం అమెరికాలో ట్రైనింగ్ తీసుకుంటోంది. 

24 హెలికాప్టర్ల కోసం ఒప్పందం

గతంలో అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ 2020 ఫిబ్రవరిలో ఇండియాకు రావడానికి కొన్ని రోజుల ముందు.. ఎంహెచ్ 60ఆర్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 24 ఎంహెచ్60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ కొనేందుకు అమెరికాతో 2.4 బిలియన్ డాలర్ల (రూ.17,906 కోట్ల)తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు రెండు రోమియో హెలికాప్టర్లు రావడంతో సముద్రంలో మన నిఘా బలోపేతం కానుంది.

రోమియో స్పెషాలిటీస్ ఇవీ

 • ఎంహెచ్ 60ఆర్.. మోస్ట్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ మారీటైమ్ మల్టీ-మిషన్ హెలికాప్టర్.
 • సికోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కై ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థ రెడీ చేసింది. 
 • ముగ్గురు, నలుగురు సిబ్బంది, ఐదుగురు ప్యాసింజర్లు వెళ్లొచ్చు.
 • ఈ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోడిఫై చేసుకునే వీలుంది. ప్రత్యేకంగా ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్, ఆయుధాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
 • 2001 జులైలో తయారైతే.. 2005 ఆగస్టులో రంగంలోకి దిగింది. 2008 మార్చిలో తొలిసారి సముద్ర ఆపరేషన్లలో ఉపయోగించారు. పూర్తిగా ఆపరేషనల్ డెప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం 2009లో వాడారు.
 • యాంటీ సబ్‌‌‌‌‌‌‌‌మెరైన్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేర్, యాంటీ సర్ఫేస్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేర్, సర్చ్ అండ్ రెస్క్యూ, నేవల్ గన్‌‌‌‌‌‌‌‌ఫైర్ సపోర్ట్, సర్వైలెన్స్, కమ్యూనికేషన్స్ రిలే, లాజిస్టిక్స్ సపోర్ట్, సిబ్బంది రవాణా తదితరాలకు ఉపయోగిస్తారు.  
 • యుద్ధనౌకలు, డెస్ట్రాయర్లు, క్రూజర్లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ క్యారియర్ల నుంచి పని చేస్తుంది. 
 • ఇందులో డ్యుయల్ కంట్రోల్స్ ఉంటాయి. పైలట్,  కో పైలట్, టాక్టికల్ మిషన్ ఆఫీసర్ ఉంటారు. సెన్సర్ ఆపరేటర్ స్టేషన్ కూడా క్యాబిన్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేసి ఉంచారు. 
 • యాంటీ సర్ఫేస్ మిసైళ్లు, మూడు లైట్ వెయిట్ టార్పెడోలు, 7.62 ఎంఎం మిషన్ గన్ ఏర్పాటు చేసి ఉంటాయి.
 • హెలికాప్టర్ బరువు 6,895 కిలోలు కాగా, మ్యాగ్జిమమ్ టేకాఫ్ బరువు 10,659 కిలోలు. 
 • గంటకు మ్యాగ్జిమమ్ 267 కిలోమీటర్లు వెళ్లగలదు. దాని రేంజ్ 834 కిలోమీటర్లు.