మోదీ పేరుతో కార్ నెంబర్ ప్లేట్..ఇదో రకమైన అభిమానం

మోదీ పేరుతో  కార్ నెంబర్ ప్లేట్..ఇదో రకమైన అభిమానం

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఒక్కోక్కరు ఒక్కో విధంగా చాటుతుంటున్నారు. అమెరికాలో భారతసంతతి వ్యక్తి రాఘవేంద్రకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ అంటే విపరీతమైన అభిమానం. తన అభిమానాన్ని రాఘవేంద్ర వినూత్నంగా చాటుకున్నాడు. అమెరికా మేరీల్యాండ్ లో తన కారు నెంబర్ ప్లేట్ కు NMODI అని రాయించుకున్నారు. ప్రధాని మోదీ తనకు స్పూర్తి అని..త్వరలో అమెరికాలో పర్యటించబోతున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నానని రాఘవేంద్ర తెలిపాడు. ప్రస్తుతం NMODI నెంబర్ ప్లేట్ వైరల్ అయింది. 

  
నాకు స్పూర్తి..

ప్రధాని నరేంద్ర మోదీ తనకు స్పూర్తి అని రాఘవేంద్ర తెలిపాడు. దేశానికి, సమాజానికి, ప్రపంచానికి ఏదైనా మంచి చేయాలన్న మోదీ మాటలను తనను ప్రేరేపిస్తాయన్నాడు. మోడీ మాటలకు ముగ్ధుడై తాను 2016లో NMODI నంబర్ ప్లేట్ ను తీసుకున్నానని చెప్పాడు. అయితే నరేంద్ర మోదీ పేరుతో నంబర్ ప్లేట్ తీసుకోవాలనుకున్నానని.. అందుకు అనుమతించలేదన్నాడు. ఆ తర్వాత తనకు NMODI పేరుతో నంబర్ ప్లేట్ జారీ చేశారని చెప్పాడు. 

మోదీ అమెరికా టూర్..

జూన్ 20 నుంచి 24 వరకు ప్రధాని అమెరికాలో పర్యటించబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ల ఆహ్వానం మేరకు అమెరికా వెళ్తున్నారు. ఈ  పర్యటనలో భాగంగా మోదీ జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో పాల్గొంటారు.  ఆ తర్వాత బిడెన్ తో  కలిసి ప్రధాని విందుకు హాజరవుతారు.  ఈ పర్యటనలో అమెరికా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మోదీ  ప్రసంగిస్తారు.