ఇండియన్ రైల్వేలో కొలువుల జాతర: సీఏ, ఎంబీఏ చేసిన వారికి మంచి అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

ఇండియన్ రైల్వేలో కొలువుల జాతర:  సీఏ, ఎంబీఏ చేసిన వారికి మంచి అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్​సీ) అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పోస్ట్ పేరు: అసిస్టెంట్ (ఎన్ఈ5 లెవల్), అసిస్టెంట్ మేనేజర్/ ఫైనాన్స్ (ఈ1 లెవల్).

మొత్తం ఖాళీలు: 23.

విభాగాల వారీగా ఖాళీలు:  అసిస్టెంట్ (ఎన్ఈ5 లెవల్) 16. (అన్​రిజర్వ్డ్ 06, ఎస్సీ 02, ఎస్టీ 02, ఓబీసీ 04, ఈడబ్ల్యూఎస్ 02), అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) 07 (అన్​రిజర్వ్డ్ 02, ఎస్సీ 01, ఎస్టీ 01, ఓబీసీ 01, ఈడబ్ల్యూఎస్ 01). 

ఎలిజిబిలిటీ 
అసిస్టెంట్ (ఎన్ఈ5 లెవల్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో కామర్స్​లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఐసీఏఐ/ ఐసీఎంఏఐలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

 అసిస్టెంట్ మేనేజర్/ ఫైనాన్స్ (ఈ1 లెవల్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో కామర్స్​లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సీఏ/ సీఎంఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్)/ పీజీడీఎం (ఫైనాన్స్) పూర్తిచేసి ఉండాలి. 

Also Read : IARIలో రీసెర్చ్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే

వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 4.

లాస్ట్​డేట్: మే 1. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ: జూన్ (తాత్కాలికం).

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ irfc.co.inను సందర్శించండి. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
సీబీటీలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. పార్ట్–ఏ, పార్ట్–బిలో భాగంగా 100 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. 

పార్ట్ –ఏ (50 మార్కులు): గణితం/ సంఖ్యా సామర్థ్యం (20), సాధారణ అవగాహన (10), తార్కిక విశ్లేషణ (10), రైల్వేలు/ ఐఆర్ఎఫ్​సీ  గురించి పరిజ్ఞానం (10).
పార్ట్ –బి (50 మార్కులు): సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు (కార్పొరేట్ అకౌంటింగ్, ఫైనాన్స్, టాక్సేషన్ మొదలైనవి) ఉంటాయి.

నెగిటివ్ మార్కింగ్: తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు తగ్గిస్తారు.

అర్హత మార్కులు: అన్​రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ – 40 శాతం, ఎస్సీ/ ఓబీసీలకు 30 శాతం, ఎస్టీలకు 25 శాతం సాధించాల్సి ఉంటుంది.