ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో రెజ్లింగ్ అకాడమీ 

ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో రెజ్లింగ్ అకాడమీ 
  • రూ.30.76 కోట్లతో నిర్మాణం

ఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో రెజ్లింగ్ అకాడమీని నెలకొల్పనున్నారు. రైల్వేస్కు చెందిన రెజ్లర్ల కోసం ఈ అకాడమీని స్థాపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని కిషన్గని ప్రాంతంలో నెలకొల్పనున్న ఈ అకాడమీ నిర్మాణం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ రూ.30.76 కోట్లు కేటాయించింది. అకాడమీలో క్రీడాకారుల కోసం అన్ని ఆధునాతన సదుపాయాలు ఉంటాయని, ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేయడం ఈ అకాడమీ లక్ష్యమని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. భవిష్యత్ లో ఎంతోమంది రెజ్లర్లకు ఈ అకాడమీ మేలు చేయనుందని వారు తెలిపారు. భారత్ లో రెజ్లింగ్ ఆటను ప్రమోట్ చేయటం కోసం ఇండియన్ రైల్వేస్ కృషి చేస్తోందని, ఇప్పటికే చాలా మంది ప్రపంచ స్థాయి రెజ్లర్లను అందించామని అన్నారు. దేశానికి ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిపెట్టిన సుశీల్ , సాక్షి మాలిక్, రవి కుమార్, బజరంగ్, మీరబాయి చానూ వంటి దిగ్గజ క్రీడాకారులు రైల్వేస్ నుంచి వచ్చిన వారేనని రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం 9 వేలకు పైగా క్రీడాకారులు రైల్వేస్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా...ఇప్పటికే రైల్వేస్ కు చెందిన క్రీడాకారులలో 27 మంది పద్మశ్రీ, 176 మంది అర్జున, 12 మంది ధ్యాన్చంద్, 14 మంది ద్రోణాచార్య, 9 మంది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డులు సాధించి ఇండియన్ రైల్వేస్ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటారని రైల్వే మినిస్ట్రీ తెలిపింది.

For more news..

ఢిల్లీ కోట బద్దలు కొడ్త

స్కూళ్లు మూణ్నెళ్లే ఉన్నా..జాయిన్ చేస్తున్నరు