చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది

చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది

చంద్రయాన్2కు సంబంధించి ఇస్రో అప్డేట్స్ను అందించింది. చంద్రయాన్2 విజయవంతంగా పనిచేస్తుందని..దాని హైరెజల్యూషన్ కెమెరాలతో ఫొటోలు తీసి ఇస్రో సెంటర్కు పంపిందని తెలిపింది. మార్చి 26, 2024న  చంద్రుని ఉపరితలంపై ఉన్న జపాన్ కు చెందిన మూన్ ల్యాండర్ కు సంబంధించిన ఫొటోలను విజయ వంతంగా సేకరించింది. చంద్రునిపై ఈ మూన్ ల్యాండర్ ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనేందుకు చంద్ర తుంగతుర్తి అనే పరిశోధకులు చంద్రయాన్ 2 పంపించిన డేటాను విశ్లేషించారు. 

16 సెం.మీ ల ఆకర్షణీయమైన పిక్సెల్ రెజల్యూషన్ తో ఫొటోలను షేర్ చేసింది. SLIM ల్యాండర్ చుట్టూ ఉన్న చంద్రుని ఉపరితలం ఆకృతులు, లక్షణాలను కూడా హైలైట్ చేసింది. 

జపాన్ ఏరోస్పేష్ ఎక్స్ ఫ్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) చంద్రుని ఉపరితలంపై కి పంపించిన తొలి మూన్ ల్యాండర్ SLIM. మూన్ స్నిపర్ అని పిలువబడే ఈ ల్యాండర్ ఖచ్చితమైన ల్యాండింగ్ స్టెబిలిటీ లో చంద్రుని భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న షియోలీ క్రేటర్ సమీపంలో చంద్రుని ఉపరితలంపై తాకింది. 

చంద్రయాన్ 2 పంపించి ఫొటోలు SLIM ఎలా ఉంది. అది ఏ స్థానంలో ఉంది వంటి విలువైన డేటాను అందించాయి. వీటిపై పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇవి భవిష్యత్ మిషన్ ప్రణాళికకు సాయపడునున్నాయి. 

చంద్రయాన్ 2 పంపించిన ఈ ఫొటోలు చంద్రునిపై ఇన్ స్ట్రమెంటేషన్ సామర్థ్యం, చంద్రుని చుట్టూ ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగి వుండటం వ్యూహాత్మక ప్రయోజనాన్ని చూపిస్తున్నాయి.