ఎన్‌–95 మాస్కులు చాలా ఎఫెక్టివ్‌.. ఇండియన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి

ఎన్‌–95 మాస్కులు చాలా ఎఫెక్టివ్‌.. ఇండియన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ సమయంలో మాస్కు కట్టుకోవడం తప్పనిసరిగా మారింది. మాస్కు తప్పనిసరి అని డాక్టర్లు, సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్‌లో పలు రకాల మాస్కులు అందుబాటులో ఉండటంతో ఏ మాస్కు కట్టుకోవాలనేది సందేహంగా మారింది. దీనికి తెర దించుతూ ఒక స్టడీ మాస్కు వాడకంపై స్పష్టతనిచ్చింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ఎన్‌–95 మాస్కులు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని ఒక స్టడీ వెల్లడించింది. దగ్గు, జలుబు వ్యాప్తిని ఎన్‌–95 మాస్కులు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని సదరు స్టడీలో తేలింది. ఈ స్టడీలో ఇస్రోకు చెందిన పద్మనాభ ప్రసన్న సింహా అనే సైంటిస్టుతోపాటు కర్నాటకలోని జయేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్​ కార్డియో వెస్క్యూలర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌కు చెందిన ప్రసన్న సింహ మోహన్ రావ్ పాల్గొన్నారు. ఈ స్టడీ రిపోర్టు ఫిజిక్స్ ఆఫ్​ ఫ్లుయిడ్స్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైంది.