ఇరాన్ స్వాధీనం నుండి ఇంటికి చేరుకున్న భారత మహిళ..

ఇరాన్ స్వాధీనం నుండి ఇంటికి చేరుకున్న భారత మహిళ..

కొద్ది రోజుల క్రితం ఇరాన్‌ స్వాధీనం చేసుకున్న MSC ఏరీస్‌ నౌకలో ఇండియన్ క్రూలో భాగమైన ఇండియన్‌ డెక్‌ క్యాడెట్‌ టెస్సా జోసెఫ్‌ ఇండియాకు తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. జోసెఫ్ బుధవారం మధ్యాహ్నం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకోగా రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఆమెను రిసీవ్ చేసుకున్నారు.

"టెహ్రాన్‌లోని ఇండియన్ మిషన్ మరియు ఇరాన్ ప్రభుత్వం యొక్క సమిష్టి కృషితో, కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఇండియన్ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ ఈ రోజు మధ్యాహ్నం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా చేరుకున్నారని," MEA ఒక ప్రకటనలో తెలిపింది. టెహ్రాన్‌లోని ఇండియన్ మిషన్ కంటైనర్ వెసెల్ లో మిగిలిన 16 మంది సిబ్బందితో టచ్‌లో ఉందని తెలిపింది.

"క్రూ మెంబర్స్ అంతా హెల్తీగా ఉన్నారని, ఇండియాలోని వారి కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నారని తెలిపారు అధికారులు. MSC ఏరీస్‌లోని మిగిలిన సిబ్బంది సభ్యుల బాగోగుల గురించి ఇండియన్ మిషన్ ఇరాన్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు అధికారులు. అంతకుముందు, విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్‌తో ఈ అంశం గురించి చర్చించారు.