200 కంపెనీలు 5 లక్షల ఉద్యోగులు…

200 కంపెనీలు 5 లక్షల ఉద్యోగులు…

వెలుగు, బిజినెస్ డెస్క్ :  ఎందరో ఉద్యోగులు కొత్తగా కంపెనీల్లోకి వస్తూ, వెళ్తూ ఉంటారు. వాళ్లందర్ని హ్యాండిల్ చేయాలంటే కంపెనీలకు ఉండే మెయిన్ డిపార్ట్‌‌‌‌మెంట్.. హ్యూమర్​ రిసోర్సెస్​ (హెచ్‌‌‌‌ఆర్). ఈ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉన్న తలకాయ నొప్పులు ఇంకెవ్వరికీ ఉండవని ఉంటారు. ఎంప్లాయీస్‌‌‌‌ను నియమించుకోవడం దగ్గర్నుంచి, వారికి జీతాలు, సెటిల్‌‌‌‌మెంట్లు ఎన్నో ఉంటాయి. ఉద్యోగులు లీవ్ అప్లయి చేసుకోవాలన్నా వెళ్లాల్సింది వారి దగ్గరికే. ఇంత ప్రాసెస్‌‌‌‌ను ఎలాంటి సమస్యలు లేకుండా..క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో పెద్ద పెద్ద కంపెనీలకు హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ సేవలందిస్తోంది డార్విన్ బాక్స్ స్టార్టప్. ఇది స్టార్టప్‌‌‌‌లకు పుట్టినిల్లు అయిన హైదరాబాద్‌‌‌‌లో 2015లో ఏర్పాటైంది.

పెద్ద కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో..

డార్విన్‌‌‌‌బాక్స్‌‌‌‌ను ఏర్పాటు చేసింది చైతన్య పెడి, జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమనేని. మెకెన్సీ అండ్ కంపెనీ, గూగుల్, ఎర్నస్ట్ అండ్ యంగ్, డెలాయిట్ వంటి కంపెనీల్లో వీరు పనిచేశారు. హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌‌‌‌ను టెక్నాలజీతో ఎందుకు సాల్వ్ చేయకూడదనే ఆలోచనతో పుట్టుకొచ్చిందే ఈ డార్విన్‌‌‌‌బాక్స్. హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అన్ని యాక్టివిటీస్.. కొత్త ఉద్యోగులను నియమించుకోవడం, ఎంప్లాయీస్‌‌‌‌ను మేనేజ్ చేయడం, వారికి జీతాలు చెల్లింపు, సెలవులు, ట్రాన్స్‌‌‌‌ఫర్లు, ఎంప్లాయీస్ పనితీరు, పదోన్నతులు, ఇక చివరికి రాజీనామాలు, పదవీ విరమణలు అన్నింటిన్నీ డార్విన్‌‌‌‌బాక్సే చూసుకుంటుంది. ఒకే ఒక్క లాగిన్‌‌‌‌తో తన వర్క్‌‌‌‌లైఫ్ అంతంటిన్నీ చూసుకోవచ్చు. కంపెనీ సీఈవోలు కూడా వారి ఉద్యోగి గురించి సమాచారమంతా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒరాకిల్, వర్క్‌‌‌‌డే, ఎస్‌‌‌‌ఏపీ వంటి పెద్ద పెద్ద దిగ్గజాలకే డార్విన్‌‌‌‌బాక్స్ పోటీఇస్తోంది. తమ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను 200 కస్టమర్లు వాడుతున్నారని, 50 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై ఉన్నారని డార్విన్‌‌‌‌బాక్స్‌‌‌‌ చెబుతోంది. డార్విన్‌‌‌‌బాక్స్‌‌‌‌కు కూడా క్లయింట్స్ పెద్ద పెద్ద వారే ఉన్నారు. బిస్లెరీ, స్విగ్గీ, పేటీఎం, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఏఎక్స్ఏ, అదానీ, మహింద్రా గ్రూప్ వంటి కంపెనీలు డార్విన్‌‌‌‌బాక్స్ సేవలు ఉపయోగించుకుంటున్నారంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. డార్విన్‌‌‌‌బాక్స్ టీమ్ కూడా ఎక్కువగా రిటైల్, టెక్నాలజీ, బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ, మానుఫాక్చరింగ్, హెల్త్‌‌‌‌కేర్, కన్జూమర్ ప్రొడక్ట్స్ వంటి రంగాలపై ఫోకస్ చేసింది.

ఆసియా హెచ్‌‌‌‌ఆర్ టెక్నాలజీ మార్కెట్‌‌‌‌ 900 కోట్ల డాలర్లు…

ఆసియాలో హెచ్‌‌‌‌ఆర్ టెక్నాలజీ మార్కెట్‌‌‌‌ 900 కోట్ల డాలర్లకు పెరుగుతుందని డార్విన్‌‌‌‌బాక్స్  కో ఫౌండర్ రోహిత్ చెన్నమనేని అంచనావేస్తున్నారు. మొబైల్ యూజర్లు పెరుగుతూ ఉంటే.. సంస్థలు తమ ఉద్యోగులతో ఎంగేజ్ అవ్వడం కూడా సరికొత్తగా మారుతుందని చెప్పారు. ప్రపంచం మొత్తానితో పోలిస్తే.. ఆసియాలో ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజసే చాలా వేగంగా క్లౌడ్‌‌‌‌లోకి మారుతున్నాయన్నారు. డార్విన్‌‌‌‌బాక్స్‌‌‌‌ ప్రస్తుతం ఇండియా, సౌత్‌‌‌‌ఈస్ట్ ఆసియాలో హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ సేవల విభాగంలో దూసుకుపోతుంది.

అంతా ఆటోమేటెడే

ఇటీవలే డార్విన్‌‌‌‌బాక్స్‌‌‌‌ సెకోయియా ఇండియా నేతృత్వం వహించిన సిరీస్ బీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ నుంచి రూ.106 కోట్ల నిధులు సేకరించింది. ఈ రౌండ్‌‌‌‌లో ఎండియా పార్టనర్స్, లైట్‌‌‌‌స్పీడ్ ఇండియా పార్టనర్స్, 3వన్‌‌‌‌4 క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ప్రతి కంపెనీకి ఇప్పుడు రిక్రూటింగ్, రిట్రైనింగ్, అప్‌‌‌‌స్కిలింగ్ అనేవి ఎంతో ముఖ్యమైనవి అని, క్లౌడ్ బేస్డ్ హెచ్‌‌‌‌ఆర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో డార్విన్‌‌‌‌బాక్స్‌‌‌‌ ఎమర్జింగ్ లీడర్‌‌‌‌‌‌‌‌ అని అర్థమవుతుందని సెకోయియా  ప్రిన్సిపాల్ హర్ష్‌‌‌‌జిత్ సేథి తెలిపారు.  హెచ్‌‌‌‌ఆర్ అంటే కేవలం సిస్టమ్స్ ఆఫ్ రికార్డు కాదు.. సిస్టమ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌‌‌‌ అని డార్విన్‌‌‌‌బాక్స్ చెబుతోంది. దీని హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్ అంతా ఆటోమేడెడ్‌‌‌‌.. ఎంప్లాయీకి సంబంధించి ప్రతీది ఇది మేనేజ్‌‌‌‌ చేస్తోంది. హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న చాలా సమస్యలను టెక్నాలజీ పరిష్కరిస్తుందని భావిస్తారు కానీ దానిని మనకు అనువుగా మలుచుకోవడం వల్లే ఇదంతా సాధ్యమవుతుందని చైతన్య అంటారు.