
ముంబై: 2023–24లోనూ గ్రోత్ మూమెంటమ్ కంటిన్యూ అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన యాన్యువల్ రిపోర్టులో తెలిపింది. జియోపొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ను హ్యాండిల్ చేసేందుకు తగిన రిఫార్మ్స్ తీసుకు రావడంతో మీడియం టర్మ్‌లోనూ గ్రోత్ నిలకడగానే ఉంటుందని పేర్కొంది. గ్లోబల్ గ్రోత్ తగ్గడం, జియోపొలిటికల్ టెన్షన్స్ కొనసాగడం వంటి కారణాలతో ఫైనాన్షియల్ మార్కెట్లలో ఓలటాలిటీ పెరిగే ఛాన్స్ ఉంటుందని, ఆ ఎఫెక్ట్ మన ఎకానమీ గ్రోత్‌పై పడొచ్చని కూడా వివరించింది.మార్చి నెలలో డెవలప్డ్ ఎకానమీలలో వచ్చిన బ్యాంకింగ్ క్రైసిస్ కొంత సద్దుమణిగిందని, పాలసీపరంగా తీసుకున్న చర్యలు ఫలితాలనిచ్చాయని పేర్కొంది.
2022–23లో మన రియల్ జీడీపీ 7 శాతం గ్రోత్ రికార్డు చేయనుందని వివరించింది. కన్జూమర్ కాన్ఫిడెన్స్ పెరగడం, పండగల సీజన్లో ఖర్చు పెంచడం వంటి కారణాల వల్ల ఈ గ్రోత్ రేటు సాధ్యపడినట్లు తెలిపింది. ప్రభుత్వం తన క్యాపెక్స్‌ను పెంచడం కూడా గ్రోత్ మూమెంటమ్‌కు సాయపడిందని వివరించింది. 2022–23 రెండవ అర్థ భాగంలో మాత్రం ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల చాలా మంది ఖర్చు తగ్గించుకున్నారని, ఎగుమతుల గ్రోత్ కూడా స్లో అయిందని వెల్లడించింది. మెరుగైన మాక్రో ఎకనమిక్ పాలసీలు, కమోడిటీ రేట్ల తగ్గుదల, జోరుమీదున్న ఫైనాన్షియల్ సెక్టార్, ఆరోగ్యకరమైన కార్పొరేట్ సెక్టార్, సప్లయ్ చెయిన్ రూపంలో కలిసి వస్తున్న కొత్త గ్లోబల్ ఆపర్చునిటీస్...ఇవన్నీ కలిసి 2023–24 లో మన ఎకానమీని నిలకడైన గ్రోత్ సాధించే దిశలో నిలబెడతున్నాయని ఆర్బీఐ తెలిపింది. రిటెయిల్ ఇన్ఫ్లేషన్ 4 శాతం దాటకుండా చూస్తామంది.
కరెన్సీ చలామణీ....
దేశంలో కరెన్సీ చెలామణీ 2022–23 లో సంఖ్యాపరంగా 4.4 శాతం, విలువపరంగా 7.8 శాతం పెరిగింది. 2023 మార్చి చివరి నాటికి చలామణీలోని మొత్తం నోట్లలో రూ. 500, రూ.2,000 కరెన్సీ నోట్ల వాటా 87.90 శాతం. మార్చి 2022 నాటికి ఈ రెండు నోట్లకు కలిపి 87.10 శాతం వాటా ఉండేది. విలువపరంగా చూసినప్పుడు కరెన్సీలో అత్యధక వాటా (37.90 శాతం) తో రూ. 500 నోటు టాప్ ప్లేస్‌లో ఉంది. రూ. 10 కరెన్సీ నోటుకు 19.20 శాతం వాటా ఉందని ఆర్బీఐ వివరించింది.
నకిలీ నోట్లు..
2021–22 తో పోలిస్తే 2022–23 లో నకిలీ నోట్లు పెరిగాయని ఆర్బీఐ యాన్యువల్ రిపోర్టు వెల్లడించింది. రూ. 500 (కొత్త డిజైన్) నకిలీ నోట్లు 14.40 శాతం, రూ. 20 నకిలీ నోట్లు 8.40శాతం ఎక్కువైనట్లు పేర్కొంది. రూ. 10, రూ. 100, రూ. 2,000 డినామినేషన్ కరెన్సీ నోట్లలో నకిలీ నోట్ల సంఖ్య వరసగా 11.60 శాతం, 14.70 శాతం, 27.90 శాతం చొప్పున తగ్గినట్లు తెలిపింది. 2022-23 లో నోట్ల ముద్రణకు అయిన ఖర్చు రూ. 4682.80 కోట్లని పేర్కొంది.