Team India: కోహ్లీ, రోహిత్ మళ్ళీ గ్రౌండ్‌లో కనిపించేది అప్పుడే .. 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియా వన్డే షెడ్యూల్ ఇదే!

Team India: కోహ్లీ, రోహిత్ మళ్ళీ గ్రౌండ్‌లో కనిపించేది అప్పుడే .. 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియా వన్డే షెడ్యూల్ ఇదే!

ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ తో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ పై ఉన్న ఆందోళనలు తొలగిపోయాయి. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకోగా .. తొలి రెండు వన్డేల్లో డకౌటైనా సిడ్నీ వన్డేలో హాఫ్ సెంచరీ చేసి కోహ్లీ మంచి టచ్ లో కనిపించాడు. కేవలం ఒకటే ఫార్మాట్ ఆడడంతో వీరి ఆట కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్నారు. కోహ్లీ, రోహిత్ వన్డేల్లో మాత్రమే కనిపించనుండడంతో వీరి నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు అని అభిమానులు ఆరాటపడుతున్నారు. 

2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోకో జోడీ ఆడాడతారని దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఏడు నెలల తర్వాత బరిలోకి దిగినా వీరిద్దరూ తమ ఫామ్ ను కొనసాగించి విమర్శకులకు సమాధానమిచ్చారు. 2027 వన్డే వరల్డ్ కప్ లోపు ఇండియా మొత్తం 21 వన్డే మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో భాగంగా మొదట సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుంది. నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది. తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక ఇండియా వన్డే షెడ్యూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..     

2027 వరల్డ్ కప్ ముందు టీమిండియా వన్డే షెడ్యూల్:     

 -2025 నవంబర్,డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది.

-2026 జనవరిలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్. ఈ ఇండియాలో ఈ సిరీస్ జరుగుతుంది.
 
-2026 జూన్‌లో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌

-2026 జూలైలో ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ (విదేశాల్లో)  

-2026 సెప్టెంబర్, అక్టోబర్ లో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్

-2026 అక్టోబర్, నవంబర్‌లో మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ లో జరగనుంది. 

-2026 డిసెంబర్ లో శ్రీలంకతో స్వదేశంలో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్

రోహిత్ సూపర్ హిట్.. కోహ్లీ ఫ్లాప్:

ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. తొలి వన్డేలో విఫలమైనా రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో చెలరేగుతూ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మరోవైపు కోహ్లీ తొలి రెండు వన్డేల్లో డకౌటై తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చాడు.       

►ALSO READ | Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ నుంచి టీమిండియా స్టార్ ఓపెనర్ ఔట్.. వికెట్ కీపర్ డౌట్!