- జీడీపీలో 5.22 శాతం వాటా, 8.46 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: దేశ జీడీపీలో టూరిజం సెక్టార్ వాటా గణనీయంగా పెరిగింది. కరోనా టైమ్‌లో 1.75 శాతం ఉండగా, 2023–-24 నాటికి 5.22శాతానికి చేరింది. టూరిజం సెక్టార్ ఇప్పటి వరకు 8.46 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. ప్రభుత్వ డేటా ప్రకారం, 2025లో దేశీయంగా 428.55 కోట్ల పర్యాటకుల సందర్శనలు జరిగాయి. 2021లో ఈ నెంబర్ 67.7 కోట్లుగానే ఉంది. విదేశీ టూరిస్ట్‌ల రాక 2.53 కోట్లకు చేరాయి. దీంతో ఫారెక్స్ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.2,76,831 కోట్లకు పెరిగింది.
2021లో ఇది రూ.63,978 కోట్లుగా ఉంది. భారత్ 172 దేశాలకు ఈ-–వీసా సదుపాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం 78శాతం వీసాలు ఆన్‌లైన్‌లోనే జారీ అవుతుండగా, 95శాతం దరఖాస్తులను 72 గంటల్లోనే పరిష్కరిస్తున్నారు. ఏఐ ఆధారిత ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్లాట్‌ఫామ్, సరికొత్త నేషనల్ డిజిటల్ టూరిజం స్టాక్, దేఖో అప్నా దేశ్ 2.0 ద్వారా టూరిజం సేవలు సులభతరమయ్యాయి. పర్యాటక ప్రాంతాలకు విమాన రాకపోకలను మెరుగుపరిచేందుకు ఉడాన్ స్కీమ్ కింద రూ.28,840 కోట్లతో 100 విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్‌లను అభివృద్ధి చేస్తున్నారు.
