
న్యూఢిల్లీ: మనదేశ ఎగుమతులు గత నెల 9 శాతం పెరిగి 38.49 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు కూడా పెరగడంతో వాణిజ్య లోటు 26.42 బిలియన్ డాలర్లకు విస్తరించింది. గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 35.27 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే ఈసారి గణనీయమైన పెరుగుదల కనిపించింది. దిగుమతులు కూడా పెరిగి 64.91 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో దిగుమతుల విలువ 49.90 బిలియన్ డాలర్లు ఉంది.
దీంతో, ఈ ఏడాది ఏప్రిల్లో వాణిజ్య లోటు 26.42 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 14.63 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు కంటే చాలా ఎక్కువ. దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్లనే ఈ వాణిజ్య లోటు పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు పెరిగాయి. దిగుమతుల్లో ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, బొగ్గు వంటి వాటా ఎక్కువగా ఉంది.