
ఖిల్లాగణపురం, వెలుగు: ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు ఇస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శనివారం ఖిల్లాగణపురంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు రాజేశ్వరికి ప్రభుత్వం తరపున మంజూరైన మొదటి బిల్లుకు సంబంధించిన రూ.లక్ష చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ఇల్లు లేని నిరుపేదలను మోసం చేసిందని చెప్పారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్ మురళీధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, పీఏసీఎస్ డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, నాయకులు ఆగారం ప్రకాశ్, రవి నాయక్, బాలకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, మున్నూరు జయకర్, నవీన్ రెడ్డి, యాదగిరి, క్యామ రాజు, శ్రీరాములు పాల్గొన్నారు.