
- ..ఇండ్ల బిల్లులు సరిగా వస్తలేవు
- పాత ఐఎఫ్‌ఎస్‌సీతో సమస్యలు
- ఆధార్‌లో తప్పులు
- జియో ట్యాగింగ్ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు
యాదాద్రి, వెలుగు : ఐఎఫ్ఎస్సీ.. ఆధార్ లో తప్పుల కారణంగా ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొందరు లబ్ధిదారులు జియో ట్యాగింగ్ చేసినా ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో విడతలవారీగా వచ్చే బిల్లుల విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటిని సరి చేయడానికి రెండు నుంచి మూడు వారాల టైమ్పడుతోంది. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోంది. ఒక్కో ఇల్లుకు వంద శాతం సబ్సిడీతో నాలుగు విడతల్లో రూ.5 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఐఎఫ్ఎస్సీ తంటా..
ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ఐఎఫ్ఎస్సీ (ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) కారణంగా ఆటంకాలు కలుగుతున్నాయి. ఎస్ బీఐ, యూనియన్‌బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో కొన్ని బ్యాంకులు విలీనమయ్యాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు విలైనమైంది. ఈ కారణంగా విలీనమైన బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ నంబర్లు మారిపోయాయి. అయినప్పటికీ కొందరి వద్ద పాత బ్యాంకులకు సంబంధించిన నంబర్లే ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రధానంగా ఇతర బ్యాంకులు విలీనమైన ఎస్ బీహెచ్, ఆంధ్రా బ్యాంకు. ఏపీజీవీబీ అకౌంట్లే ఉన్నాయి.
ఇండ్ల బిల్లులకు సంబంధించి పాత అకౌంట్ల ఐఎఫ్ఎస్సీ నంబర్లనే పేర్కొనడంతో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు కలుగుతున్నాయి. కారణాలు తెలుసుకొని నంబర్లు చేంజ్చేయడం, వాటిని పరిష్కరించడానికి చాలా సమయం పడుతోంది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా అకౌంట్లు కలిగిన వారిది మరో సమస్య. ఆ బ్యాంకు సంబంధించి అకౌంట్ నంబర్‌కు పదకొండు డిజిట్స్ కాకుండా పది డిజిట్స్ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. సమస్య తెలుసుకొని ‘0’ కలిపి 11 డిజిట్స్గా మార్చి అప్లోడ్ చేస్తున్నారు.
ఆధార్ మరో సమస్య..
ఇండ్ల బిల్లులకు ఆటంకం కలగడానికి ఆధార్ మరో సమస్యగా మారింది. ఆధార్‌లో ఎక్కువగా స్పెల్లింగ్మిస్టేక్స్ ఉంటున్నాయి. దీంతో బ్యాంకులో ఉన్న పేరుకు ఆధార్‌లో ఉన్న పేరు సెట్ కావడం లేదు. దీంతో ‘ఆధార్మిస్ మ్యాచ్’ అని వస్తోంది. కొందరికి బేస్మెంట్ బిల్లు వచ్చినా.. రెండో బిల్లు వచ్చే సమయానికి మిస్ మ్యాచ్ అంటూ వస్తోంది.
ప్లాన్ చేంజ్ చేస్తే..
ఒక్కో లబ్ధిదారుడు ఇల్లు పూర్తి చేసేవరకు స్టెప్ బై స్టెప్ ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం ముగ్గు పోసి జియో ట్యాగింగ్ చేసిన తర్వాత ప్లాన్‌లో ఎలాంటి చేంజ్ చేయకూడదు. కానీ కొందరు మారుస్తున్నారు. ఈ కారణంగా ఫొటో తీసి అప్లోడ్ చేస్తే ‘గో టూ నియర్ ప్లేస్’ అంటూ రిజెక్ట్చేస్తోంది. దీంతోపాటు నిర్మిస్తున్న ఇంట్లో ‘ఎల్’ షేప్లోనే కిచెన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కచ్చితంగా సిమెంట్ భీమ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు కిచెన్ నిర్మించకుండా ప్లాట్ ఫారం నిర్మిస్తున్నారు. దీంతో యాప్ ఆక్సెప్ట్ చేయడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.
అదే విధంగా సైట్ ఓకే చేసిన చోట నిర్మిస్తున్న ఇల్లు ఎదురుగా నిలబడి లబ్ధిదారుడు ఫొటో తీయించుకోవాలి. అయితే నెట్ సమస్య కారణంగా కొందరు నెట్ వస్తున్న చోట నిలబడి ఫొటో తీయించుకొని అప్లోడ్ చేస్తున్నారు. దీంతో లొకేషన్ చూపించడం లేదు. హౌసింగ్ఆఫీసర్లను వచ్చి ఫొటో తీయాలని లబ్ధిదారులు కోరుతున్నా.. కొందరు రాకుండా రకరకాల కారణాలు చెబుతున్నారు. ఇలాంటి కారణాల వల్ల లబ్ధిదారులకు బిల్లు అకౌంట్లో జమ కావడం లేదు. ఈ విధంగా ఒక్క యాదాద్రి జిల్లాలోనే 300 మందికి పైగా బిల్లులు ఆగిపోయాయి. ఆధార్, ఐఎఫ్ఎస్సీ వంటి వాటిని సరి చేయడానికి కనీసం రెండు నుంచి మూడు వారాలు పడుతోంది.
300 ఇండ్లకు బిల్లులు పెండింగ్..
జిల్లాలో 9,588 ఇండ్లు అలాట్ కాగా, 9,398 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. వీటిలో 7,203 ఇండ్లు గ్రౌండ్ అయ్యాయి. బేస్మెంట్ లెవల్లో 2,700 నిర్మాణాలు, 226 గోడల లెవల్, స్లాబ్ లెవల్‌కు 109 ఇండ్లు స్లాబ్ లెవల్‌కు చేరుకున్నాయి. 3 ఇండ్లు పూర్తయ్యాయి. కాగా జిల్లాలో 300 మందికి పైగా బిల్లులు ఆగిపోయాయి. ఆధార్, ఐఎఫ్ఎస్సీ వంటి సమస్యలను సరి చేయడానికి కనీసం రెండు నుంచి మూడు వారాలు పడుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.