మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి 

పాలమూరు, వెలుగు: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పార్టీలకతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మహబూబ్ నగర్  ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం శిల్పారామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరంలోని 1,437 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తైబజార్  రద్దు చేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకురాబోతున్నామని, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకే తాము పని చేస్తున్నామన్నారు.

పేదోడి సొంతింటి కల సాకారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకొని మహబూబ్ నగర్ ను నెంబర్  వన్  సిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రెండు, మూడు వారాల్లో అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్  కార్పొరేషన్, ముడా, లైబ్రరీ, ఏఎంసీ చైర్మన్లు  ఓబేదుల్లా కొత్వాల్, లక్ష్మణ్ యాదవ్, మల్లు నర్సింహారెడ్డి, బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, ఏఎంసీ వైస్​ చైర్మన్​​పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, వైస్  చైర్మన్  షబ్బీర్  అహ్మద్, జహీర్ అక్తర్, సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, ఎన్పీ  వెంకటేశ్, మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు