ఏప్రిల్ ఫూల్ వీడియో.. విద్యార్థి  ప్రాణం తీసింది

ఏప్రిల్ ఫూల్ వీడియో.. విద్యార్థి  ప్రాణం తీసింది

ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా ఫ్రెండ్‌ను ఫూల్ చేద్దామని అనుకోకుండా ఓ ఇంటర్మీడియేట్ స్టూడెంట్ చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం అభిషేక్(18) అనే ఇంటర్మీడియేట్ విద్యార్థి ఫ్రాంక్ చేసి తన ఫ్రెండ్ ఫూల్ చేద్దామనుకున్నాడు. తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అభిషేక్ ఫ్యాన్‌కు తాడు బిగించి, స్టూల్‌పై నిల్చొని తన ఫ్రెండ్ కు వీడియో కాల్ చేశాడు. తాను చనిపోతున్నా అని బెదిరించి స్నేహితున్ని భయపెట్టాడు. తర్వాత సూసైడ్ గురించి వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా అభిషేక్ నిల్చొన్న స్టూల్ పక్కకు పడిపోయింది. దీంతో మెడకు ఉరి బిగించుకుంది.

అభిషేక్ కుటుంబ సభ్యులకు అతని ఫ్రెండ్ ఫోన్ చేసి వెంటనే అభిషేక్ ని రక్షించాలని చెప్పాడు. అభిషేక్ తల్లిదండ్రులు రూంకి వచ్చి విద్యార్థిని హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ కు వెళ్లేలోపే విద్యార్థి చనిపోయాడు. ఏప్రిల్ ఫూల్ ఫ్రాంక్ వీడియో అపశ్రుతి చోటుచేసుకొని ప్రాణం కోల్పోయాడు. ఈ విషయం ఏప్రిల్ 1 సోమవారం రోజున జరగగా...ఈరోజు వెలుగులోకి వచ్చింది. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు.