ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌కు రూ. 1,963.54 కోట్ల నికర లాభం

ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌కు రూ. 1,963.54 కోట్ల నికర లాభం

న్యూఢిల్లీ: ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌కు కిందటేడాది డిసెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ3) లో రూ. 1,963.54 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్)  వచ్చింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ. 1,241.39 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం ఎక్కువ. బ్యాంక్ రిజల్ట్స్ ఎనలిస్టుల​ అంచనాలను మించాయి. ఐదు బ్రోకరేజి కంపెనీలు ఈ బ్యాంక్‌‌కు సుమారు రూ.1,800 కోట్ల నికర లాభం వస్తుందని అంచనావేశాయి.  స్టాండ్‌‌ ఎలోన్ ప్రాతిపదికన ఇండస్​ఇండ్​ బ్యాంక్‌‌కు క్యూ3 లో రూ.1,959 కోట్ల నికర లాభం వచ్చింది.

బ్యాంక్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరిగి రూ.4,450 కోట్లకు చేరుకుంది. లోన్లు ఇవ్వడం పెరగడంతో పాటు, ప్రొవిజన్లు తగ్గడంతో బ్యాంక్  నికర లాభం ఎగిసింది. 2021 లోని డిసెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే  తాజా క్యూ3 లో రూ.1,065 కోట్లను ప్రొవిజన్లు, కాంటింజెన్స్‌‌ల కోసం ఇండస్‌‌ఇండ్ బ్యాంక్ కేటాయించింది. బ్యాంక్ అసెట్ క్వాలిటీ క్యూ3 లో మెరుగుపడింది. మొండిబాకీలుగా మారిన లోన్ల (గ్రాస్) వాటా 2.11 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గింది.   గ్రాస్ ఎన్‌‌పీఏలు క్యూ3 లో రూ.5,702 కోట్లకు తగ్గాయి. నెట్ ఎన్‌‌పీఏల రేషియో 0.71 శాతం నుంచి 0.61 శాతానికి మెరుగుపడింది.