ఎల్లంపల్లికి 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 38 గేట్లు ఓపెన్

ఎల్లంపల్లికి 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 38 గేట్లు ఓపెన్

మంచిర్యాల, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఎస్సారెస్పీతో పాటు కడెం ప్రాజెక్టు, క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 4 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.147 టీఎంసీలు ఉన్నాయి. దీంతో  కొద్దిరోజులుగా 38 గేట్లు ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. 

మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎస్సారెస్పీ నుంచి 2,38,720 క్యూసెక్కులు, కడెం నుంచి 5,273 క్యూసెక్కులు, క్యాచ్ మెంట్  ఏరియా నుంచి 1,53,718 క్యూసెక్కులతో కలిపి 3,97,71 1 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది. 38 గేట్ల ద్వారా 4,28,176 క్యూసెక్కులు గోదావరిలోకి రిలీజ్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీంకు 276 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు వదులుతున్నారు.