ఐటీ దాడుల్లోదొరికింది 2 వేలే

ఐటీ దాడుల్లోదొరికింది 2 వేలే
  • రూ.1.2 లక్షల విలువైన నగలు కూడా

న్యూఢిల్లీ:   యూనికార్న్​ స్టార్టప్​లలో ఒకటైన ‘ఇన్​ఫ్రా డాట్​ మార్కెట్​’ ఆఫీసులపై ఐటీ డిపార్ట్​మెంట్​ ఈ నెల తొమ్మిది నుంచి 12వ తేదీ వరకు దాడులు చేసింది. ఈ మూడు రోజుల సోదాల తరువాత చివరికి కేవలం రూ.రెండు వేల నగదును, రూ.1.2 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకుంది. ఠాణే, బెంగళూరు, హైదరాబాద్​, నోయిడాలో ఈ దాడులు జరిగాయి. లెక్కల్లో చూపని డబ్బు గానీ, ఆస్తి గానీ దొరకలేదని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. ఇన్​ఫ్రా డాట్​కామ్​ మార్కెట్​ ను సోవిక్​ సేన్​గుప్తా, ఆదిత్య సర్దా నడిపిస్తున్నారు. సోవిక్​ ఇంట్లో రూ.రెండువేల క్యాష్​, రూ.1.2 లక్షల నగలు దొరికాయి. ఆదిత్య ఇంట్లో రూ.20 లక్షల విలువైన నగదు, నగలు దొరికినా, వాటిని విడిపించుకోవడానికి దరఖాస్తు ఇచ్చామని, అవి తన కుటుంబ సభ్యులవని ఆయన వివరించారు. జెట్​వర్క్ అనే బీ2బీ యూనికార్న్​ ఆఫీసులపైనా ఐటీ దాడులు జరిగాయి. వీటి​సేవలు ఉపయోగించుకునే కొందరు సప్లయర్లు ట్యాక్సులు చెల్లించలేదనే అనుమానంతో దాడులు చేశామని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. మరికొన్ని స్టార్టప్​లకు కూడా నోటీసులు  పంపారని తెలిసింది. ‘‘త్వరలో ఫైనాన్షియల్​ ఇయర్​ ముగియనుంది. రెవెన్యూ పెంచుకోవడానికే ఐటీశాఖ ఇలాంటివి చేస్తుందేమో అనిపిస్తోంది’’ అని ఒక స్టార్టప్​కు చెందిన ఇద్దరు వివరించారు. స్టార్టప్స్​లో భారీగా పన్ను ఎగవేతలు ఉండే అవకాశాలు లేవన్నారు.