
గత ఏడాది ‘తునివు’ సినిమాతో హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్.. ప్రస్తుతం ‘విదా ముయార్చి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. గత కొద్దిరోజులుగా అజర్‌బైజాన్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ నుంచి విడుదలైన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మునుపటి కంటే స్లిమ్ అండ్ ఫిట్‌గా కనిపిస్తున్న అజిత్, స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.
అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సమ్మర్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో కొత్త చిత్రానికి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ‘మార్క్ ఆంటోనీ’ ఫేమ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం ఉండనుందట. అజిత్ కెరీర్‌లో ఇది 63వ సినిమా కానుంది. దీని తర్వాత వెట్రి మారన్ డైరెక్షన్‌లో అజిత్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ‘సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనూ అజిత్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే సలార్ 2, ఎన్టీఆర్ సినిమా, కేజీఎఫ్ 3 పూర్తయ్యాకే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉండబోతోందట.