
లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మంగళవారం టెక్నోలార్డ్స్-2019,ఆన్యువల్ టెక్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ టెక్నో ఫెస్ట్లో విద్యార్థులు తమ ఇన్నోవేటివ్ ప్రొడక్స్ట్ ని ఎగ్జిబిట్ చేశారు. వీటిలో 70 ప్రొడక్స్ట్ రూపొందించగా 360 డిగ్రీలు వర్టికల్లీ మూవ్ అయ్యే ఇన్నోవేటివ్ స్పెరికల్ వీల్ బైక్ (ఎస్ డ్యబ్ల్ యూ బీ ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . హ్యుమన్ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ ఇన్నోవేషన్స్ రూపొందించారు.ఆటోమేటిక్ క్లీనింగ్ మెషీన్, సోలార్ ఎలక్ట్రిక్ బగ్గి,స్టూడెంట్స్ హైబ్రీడ్ బైక్, గోకార్ట్, ఎలెక్ట్రిక్ బైక్,ఆటోమేటిక్ బౌలింగ్ మెషీన్, సోలార్ బైక్ (సోలార్స్కూటీ) వంటి వాటిని డిస్ ప్లే చేశారు.