బోర్డు పరీక్షల నిర్వహణపై సుప్రీంలో విచారణ

బోర్డు పరీక్షల నిర్వహణపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: రాష్ట్రాల బోర్డుల పరీక్షల నిర్వహణ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ ఉమేష్ మహేశ్వరి ధర్మాసనం నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా 10, 12 తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని.. ప్రత్యామ్నాయం లేదని సుప్రీంలో ఏపీ సర్కార్ గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా కేసుల సంఖ్య వేగంగా తగ్గతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. పదో తరగతిలో మార్కులు కాకుండా గ్రేడ్లు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మార్కులు లెక్కించడం సరికాదని స్పష్టం చేసింది. రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తామని, గదికి 15 నుంచి 18 మంది మించకుండా చూస్తామని కోర్టుకు విన్నవించింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తామని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌‌లో పేర్కొంది. కేరళ ప్రభుత్వం కూడా 11 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపింది. అయితే ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి.