గద్వాల, వెలుగు: నామినేషన్ వేయకుండా అడ్డుకొని బంధించిన ఘటనపై రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులు ఎంక్వైరీ చేశారు. గత నెల 29న కేటీ దొడ్డి మండలం చింతలకుంట గ్రామ సర్పంచ్ పదవికి అభ్యర్థి కుశ నామినేషన్ వేసేందుకు యర్సన్ దొడ్డి సెంటర్ కు వెళ్తున్నాడు.
గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆయనను అడ్డుకొని నామినేషన్ వేయకుండా రూమ్ లో బంధించారు. నామినేషన్ పత్రాలు చించివేశారు. ఘటనపై బాధితుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఎంక్వైరీకి ఆదేశించారు. మంగళవారం కేటీ దొడ్డి తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో రమణారావు, ఎస్ఐ శ్రీనివాసులు వెళ్లి బాధితుడితో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. రిపోర్టును కలెక్టర్ కు అందించడం జరుగుతుందని ఆఫీసర్లు తెలిపారు.
